ఫొటోలకు పోజులు
అలనాటి లెజెండరీ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్, ఆయన కూతుళ్లు గీతా, బబితా ఫొగట్ లతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఇక గీతా ఫోగట్ విషయానికి వస్తే మహావీర్ పెద్ద కూతురు. మాజీ రెజ్లింగ్ క్రీడాకారిణి. 2009, 2011 లలో జరిగిన కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ పోటీలలో రెండు సార్లు గోల్డ్ మెడల్‌ను సాధించింది.
కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్
ఢిల్లీలో 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్‌తోపాటు, 2013లో అదే గేమ్స్‌లో సిల్వర్ మెడల్‌ను సాధించింది. ఇదే కాకుండా 2012లో లండన్‌లో జరిగిన ఒలంపిక్స్‌లో 55 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ పోటీలకు క్వాలిఫై కూడా అయింది. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్‌గా గీతా ఖ్యాతిని కూడా సొంతం చేసుకుంది.
హర్యానా పోలీస్ విభాగంలో డీఎస్పీ
అయితే దురదృష్టవశాత్తూ లండన్ ఒలంపిక్స్‌లో మెడల్ సాధించలేకపోయింది. అయినా ఆటలో ఆమె చూపిన పోరాట పటిమ అనిర్వచనీయం. అందుకే హర్యానా ప్రభుత్వం ఆమెకు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చింది. హర్యానా పోలీస్ విభాగంలో డీఎస్పీగా ఆమెను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నియమించింది.
‘దంగల్’ చిత్రంలో అమీర్ ప్రధాన పాత్ర
కాగా, నాటి రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘దంగల్' చిత్రంలో ప్రధాన పాత్రను అమీర్ పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అమీర్ వారి కుటుంబానికి చాలా దగ్గరయ్యాడు. మహవీర్ కుమార్తెలతోనూ ఆయన అనుబంధం బలపడింది. అందుకే అమీర్ ఖాన్ గీతా ఫోగట్ పెళ్లికి హాజరై ఆమెను ఆశీర్వదించారు.
దంగల్ డైరెక్టర్ నీతేష్ తివారికి కూడా ఆహ్వానం
హర్యానాలో జరిగిన గీతా ఫోగట్ వివాహానికి హాజరు కావాల్సిందిగా అమీర్ ఖాన్‌తో పాటు దంగల్ డైరెక్టర్ నీతేష్ తివారికి కూడా ఆహ్వానం అందింది. ఈ వివాహ వేడుకలో జరిగే ప్రతీ కీలక ఘట్టాన్ని దగ్గరుండి తిలకించేందుకు అమీర్ ఖాన్ ఈ మూడు రోజులపాటు అక్కడే ఉన్నాడు.
ప్రమోషన్ కోసమే గీతా ఫోగట్ పెళ్లికి
తన చిత్రాలు విడుదలయ్యే ముందు ప్రమోషన్ వ్యూహాలు రచించడంలో ఆమిర్ దిట్ట. అందుకే తన సినిమాకి రియల్ హీరో అయిన మహావీర్ సింగ్ కూతురు గీతా పోగట్ పెళ్లికి హాజరై చిత్రంపై అంచనాలు పెంచేందుకే ఇదంతా చేస్తున్నాడని బీటౌన్‌లో టాక్! చిత్ర షూటింగ్ సమయంలో బబిత, గీతాతో ఆమీర్ ఎక్కువగా గడిపారు.