Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాడు ఆత్మహత్యాయత్నం, రియోలో స్వర్ణం గెలిచాడు

రియో డి జెనీరో: ఒకప్పుడు ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి ఒకతను ఇప్పుడు రియో ఒలింపిక్స్ 2016లో ఏకంగా స్వర్ణం గెలుచుకున్నాడు. అమెరికా స్విమ్మర్ ఆంటోనీ ఎర్విన్.. ఒకప్పుడు ఆత్మహత్యకు యత్నించి, అందులో విఫలమయ్యాడు. ఎర్విన్ 2004 సిడ్నీ ఒలింపిక్స్‌‌తో కెరీర్‌ను ప్రారంభించాడు.

ఆ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడంతో పందొమ్మిదేళ్లకే స్వర్ణ పతకం సొంతం చేసుకున్న ఆటగాడిగా అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత 2006లో స్విమ్మింగ్‌కు గుడ్ బై చెప్పాడు. అప్పటికే టోరెట్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడే ఎర్విన్... ఆ బాధ నుంచి ఉపశమనం పొందేందుకు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు.

A suicide attempt, homelessness, a rock band and a daughter

డ్రగ్స్ సేవించి బైక్ తీసుకుని నచ్చినట్టు నడిపేవాడు. దీంతో పోలీసులకు చాలాసార్లు పట్టుపడ్డాడు. వారు కొన్నిసార్లు హెచ్చరికలు, మరికొన్నిసార్లు జరిమానాలు విధించారు. ఓ దశలో సన్నిహితుల సలహా మేరకు మ్యుజిషియన్‌గా మారాలని సంగీతం స్కూల్లో చేరాడు.

అయితే అది అతని వల్ల కాకపోవడంతో మధ్యలోనే మానేశాడు. దీంతో మళ్లీ మందు తాగడం ప్రారంభించాడు. ఓ సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కానీ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత జీవితంలో తాను మారాలని నిర్ణయించుకున్నాడు.

దీంతో మళ్లీ సుదీర్ఘ విరామం అనంతరం స్విమ్మింగ్ పూల్‌లోరి దిగి శిక్షణ ప్రారంభించి కొత్త జీవితం ప్రారంభించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల ప్రీ స్టైల్ స్విమ్మింగ్ పోటీల్లో అమెరికా తరపున పాల్గొని అయిదో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు రియో ఒలింపిక్స్ లో 400 మీటర్ల రిలేలో 50 మీటర్ల ప్రీస్టైల్ విభాగంలో స్వర్ణపతకాలు సాధించి సత్తా చాటాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+