Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొట్టొచ్చు, కొట్టించుకోవచ్చు..చెంపదెబ్బల ఛాంపియన్‌షిప్ (వీడియో)

A Sport Where You Have To Slap Your Opponent - Welcome To The Russian Slapping Championship

హైదరాబాద్: చెంపదెబ్బ చాలా బాధాకరం. విచారమైన విషయం కూడా. ఎందుకంటే చెంపదెబ్బ అంటే ఏదో శిక్ష వేసేప్పుడు మాత్రమే వాడే ప్రక్రియ. ఒక్క సారిగా అరచేతితో చెంపపై దెబ్బ పడిందంటే దేవుడు గుర్తు రావలసిందే. ఇలా చెంపదెబ్బలు మనం సినిమాల్లో తరచుగా చూస్తుంటాం. ఆ మధ్య వచ్చిన సినిమాలో చెంపదెబ్బలకు మీరు ఇచ్చిన రియాక్షన్ నాగర్జున గారికి తెగ నచ్చిందంటే బుగ్గలు బూరెలు అయ్యేంతలా కొట్టించుకుంటాడు బ్రహ్మానందం.

కానీ, ఇక్కడ పూర్తిగా సన్నివేశం తారుమారు.. రియాక్షన్ ముఖ్యం కాదు. ఎవరెంత గట్టిగా కొట్టారనేదే విషయం. చెంపలపై నాలుగు వేళ్లు పడాల్సిందే. దెబ్బకు దవడ ఊడిపడాల్సిందే. అనే స్థాయిలో రెచ్చిపోయి ఆడుతున్నారు. అదెక్కడో తెలుసా.. రష్యాలో చెంపదెబ్బల ఛాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నారు. ఈ చెంపదెబ్బల ఛాంపియన్‌షిప్‌లో పోటీదారులు ప్రత్యర్థుల చెంప చెళ్లుమనిపించాలి. సరదాగా కొట్టుకున్నట్టు మెల్లగా అలా చెంపలపై చేతులు ఆనించినట్టు ఉండదిది.

అవతలి వారి చెంపపై కొట్టేముందు చేతిని ఊపుతూ సమతూకం తెచ్చుకుంటారు. ఎలా కొడితే అవతలి వారి చెంపపై అచ్చులు పడి వాచిపోతుందో ఆ స్థాయిలో సాధన చేస్తారు. ఇలా ప్రత్యర్థులు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు చెరొకటి ఇచ్చుకుంటారు. అలా ప్రత్యర్థి చివరికి నావల్ల కాదు బాబోయ్‌ అని నిష్ర్కమించే వరకూ పోటీ జరుగుతుంది. అలా వెళ్లినవారు ఓడిపోయినట్టు లెక్క.

వేగంగా, బలంగా కొట్టే చెంపదెబ్బలతో తల తిరుగుతుంది. గూబ గుయ్‌మంటుంది. ఒక్కోసారి ఏం జరుగుతుందో అర్థంకాదు. చెంపపై వేలి అచ్చులు పడతాయి. ఎర్రగా కందిపోతుంది. అందుకే గాయాల పాలైతే తమది బాధ్యత కాదని నిర్వాహకులు ముందే చెప్పేస్తారు.

Story first published: Monday, November 19, 2018, 18:00 [IST]
Other articles published on Nov 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+