For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహేష్ భూపతి, లారా దత్తా కాపురానికి బీటలు, కెల్లీ చిచ్చు?

By Pratap
Mahesh Bhupathi-Lara Dutta
బెంగళూరు‌: వివాహం చేసుకుని నాలుగు నెలలు మాత్రమే అయింది, లారా దత్తా, మహేష్ భూపతి కాపురంలో కలహాలు ప్రారంభమయ్యాయి. నటి లారా దత్తా, టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి దాంపత్యం బీటలు వారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లారా దత్తా తన మాజీ ప్రియుడు కెల్లీ దోర్జీతో ఇంకా సంబంధాలు కొనసాగించడం కలహాలకు ప్రధాన కారణమని అంటున్నారు. వ్యక్తిగత విషయాలపై, వృత్తిపరమైన అంశాలపై లారా, మహేష్ తరుచుగా గొడవ పడుతున్నారని తెలుస్తోంది. అయితే, పరిస్థితి ఇంకా చేయి దాటిపోలేదని చెబుతున్నారు

ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్టులో పనిచేయడం కూడా సమస్యకు కారణమని అంటున్నారు. లారా దత్తా హోం ప్రొడక్షన్ చలో దిల్లీకి మహేష్ భూపతి సహ నిర్మాతగా వ్యవహరించాడు. ప్రమోషన్, ప్రచారం కార్యక్రమాల్లో వాళ్లు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. మహేష్ భూపతి ఈ కార్యక్రమాలకు తగిన సమయం కేటాయించలేదనేది లారా ప్రధాన ఆరోపణ. మీడియా సమావేశంలో కూడా వారిద్దరు తీవ్రమైన ఇబ్బందికి గురైనట్లు తెలిసిపోయింది.

ఏడేళ్ల పాటు సాగిన కెల్లీతో సంబంధాలను లారా దత్తా తెంచుకోలేకపోతుందని అంటున్నారు. కెల్లీతో లారా స్నేహం కొనసాగడం పట్ల మహేష్ భూపతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. లారా స్నేహితులతో మహేష్ భూపతి కలవలేకపోతున్నాడు. దీంతో ఇరువురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+