కెప్టెన్ రాణించకపోతే గౌరవం కోల్పోతాడు: గవాస్కర్

'కెప్టెన్ ఆట తీరు నాసిగా మారిన మరుక్షణం డ్రెస్సింగ్ రూమ్‌లో తన మాట చెల్లుబాటును, గౌరవాన్ని అతను కోల్పోతాడు. అందుకే అతను తన బ్యాటింగ్‌పైనే కాకుండా తన కీపింగ్‌పై కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది" అని గవాస్కర్ అన్నారు. ధోని పేలవమైన సారథ్యం, నాసిరకం వికెట్‌కీపింగ్, అధ్వానమైన బ్యాటింగ్ మొదటి రెండు టెస్ట్‌లలో ఇండియా ఘోర వైఫల్యానికి ప్రధాన కారణాలు. ధోని ఇంత వరకు నాలుగు ఇన్నింగ్స్‌లో 49 పరుగులు మాత్రమే స్కోరు చేశాడు. అతని అత్యధిక స్కోరు 28 పరుగులు. అతని సగటు 12.50. మామూలు బంతులను కూడా లోపరహితంగా అందుకోవడంలో అతను చాలా సార్లు విఫలమయ్యాడు.
ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం సాగుతున్న టెస్ట్ సీరీస్‌లో ఇంగ్లండ్ కన్నా 0-2తో ఇండియా వెనుకబడిన తరువాత విమర్శలను ఎదుర్కొంటున్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మేటి పాకిస్తాన్ పేస్ బౌలర్ వసీమ్ అక్రమ్ మద్దతు లభించింది. రెండు పరాజయాల ఆధారంగా ధోనిని తోసివేయకూడదని అక్రమ్ అభిప్రాయపడుతున్నాడు. అక్రమ్ లండన్‌లో 'మొబైల్ ఇఎస్‌పిఎన్"తో మాట్లాడుతూ, 'రెండు ఓటముల ఆధారంగా అతనిని ఎవరూ తక్కవగా మాట్లాడకూడదు. అతను ఇండియాకు ప్రపంచ కప్‌ను సాధించాడు. ఇంకా ప్రపంచంలో చాలా చోట్ల అతను బాగా రాణించాడు. అయితే, తన కీపింగ్‌లో నాణ్యత గురించి ధోని శ్రద్ధ వహించవలసిన అవసరం ఉందనేది నిజం.
అతను విఫలమయ్యాడని అనలేం. ఇది అతనికి ఒక హెచ్చరిక వంటిదని భావించాలి" అని పేర్కొన్నాడు. కాగా, నాటింగ్‌హామ్‌లో రెండవ టెస్ట్‌లో ముందు బౌల్ చేయాలన్న ధోని నిర్ణయాన్ని భారత మాజీ సారథి సౌరవ్ గంగూలితో సహా పలువురు నిపుణులు ఆక్షేపించారు. కాని వారితో అక్రమ్ ఏకీభవించడం లేదు. 'మొదటి రోజు ఉదయం ఎంతో పచ్చిక ఉంది. అందువల్ల ధోని తనకు తోచిన ప్రకారం వ్యవహరించాడు. అతను ముందు బౌలింగ్‌ను ఎంచుకోవడం సరైనదేనని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరికి సొంత అభిప్రాయాలు ఉంటాయి. అయితే, ఒక బౌలర్‌గా నేను ఆ పిచ్‌పై బౌల్ చేయడానికి ఇష్టపడి ఉండేవాడిని" అని అక్రమ్ చెప్పాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications