99 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆస్ట్రేలియా స్విమ్మర్

హైదరాబాద్: ఆస్ట్రేలియాకు చెందిన 99 ఏళ్ల జార్జ్ కరోన్స్ అనే స్విమ్మర్ ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో విభాగంలో 100-104 ఏళ్ల క్యాటగిరీలో పోటీపడ్డ జార్జ్ కరోన్స్ కేవలం 56.12 సెకన్లలో పూర్తి చేశాడు.
దీంతో 2014లో బ్రిటిష్ స్మిమ్మర్ జాన్ హారిసన్ నెలకొల్పిన 1:31.19 రికార్డు కంటే 35 సెకన్లు ముందుగానే లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి వందేళ్లు పూర్తి చేసుకోనున్న కరోన్స్ రికార్డుని స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ సైతం ధ్రువీకరించింది.

స్విమ్మింగ్ ఈవెంట్ అనంతరం కరోన్స్ మాట్లాడుతూ 'ఇది నాకు అద్భుతమైన స్విమ్మింగ్. చాలా బ్యాలెన్సింగ్‌గా చేశా. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో నా చేతితో గోడను బలంగా తాకాను' అని తెలిపాడు. బ్రిస్బేన్ చెందిన కరోన్స్ తన 80 ఏళ్ల వయసులో స్విమ్మింగ్ కెరీర్‌ను సీరియస్‌గా తీసుకున్నానని చెప్పాడు.
తనకు చిన్నతనం నుంచే స్విమ్మింగ్ అంటే ఎంతో మక్కువ ఉండటంతో చార్లీ విల్లీలోని ప్రైమరీ స్కూల్‌లో స్విమ్మింగ్ నేర్చుకోవడం ప్రారంభించానని, ఆ తర్వాత హైస్కూల్, యూవివర్సిటీ స్థాయిలో కూడా స్విమ్మింగ్ చేసినట్లు తెలిపాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో స్విమ్మింగ్‌ను వదిలేసినట్లు తెలిపాడు.
ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వ్యాయామం కోసం స్విమ్మింగ్ చేయడం మొదలుపెట్టానని అన్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్వెల్త్ పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆతడు ఆస్ట్రేలియా స్విమ్మింగ్ ట్రైల్స్ రేసులో పాల్గొని ఈ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications