For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చరిత్ర సృష్టించిన 9 ఏళ్ల బాలుడు.. గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించి!

క్రీడల్లో సత్తాచాటడానికి వయస్సుతో సంబంధం లేదని మరోసారి రుజువైంది. ఇటీవల ఐపీఎల్ మెగావేలంలో 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ రూ.1.10 కోట్లు పలికి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేలం చరిత్రలో అమ్ముడుపోయిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ కుర్రాడిపై ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీపడి రాజస్థాన్ రాయల్స్ కాసుల వర్షం కురిపించింది.

కాగా, తాజాగా చెస్‌లో తొమ్మిదేళ్ల బాలుడు అరుదైన ఘనత సాధించాడు. గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అతిపిన్న భారతీయుడిగా ఆరిత్ కపిల్ చరిత్ర సృష్టించాడు. కేఐఐటీ ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్‌లో ఢిల్లీకి చెందిన ఆరిత్ ఈ రికార్డు అందుకున్నాడు. సోమవారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ రాసెట్ జియత్‌దినొవ్‌ను ఆరిత్ ఓడించి ఈ ఘనత సాధించాడు.

9-Year-Old Aarit Kapil Stuns Chess World Becomes Youngest Indian to Beat a Grandmaster

63 ఎత్తుల పాటు సాగిన ఈ గేమ్‌లో 66 ఏళ్ల రాసెట్‌ను ఆరిత్ ఓడించాడు. ఆరిత్ వయస్సు 9 ఏళ్ల 2 నెలల 18 రోజులు. కాగా, ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన మూడో అతి పిన్న వయస్కుడిగా ఆరిత్ రికార్డు సాధించాడు. సింగపూర్‌కు చెందిన అశ్వత్ కౌశిక్ 8 ఏళ్ల 2 నెలల వయస్సులో గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించాడు. కౌశిక్ భారత సంతతికి చెందిన వ్యక్తినే కావడం విశేషం.

ఇక ఆరిత్ కంటే తక్కువ వయస్సులో సెర్బియాకు చెందిన లియోనిడ్ ఇవనోనిక్ ఈ ఘనత సాధించాడు. లియోనిడ్ 8 ఏళ్ల 11 నెలల వయస్సులో గ్రాండ్‌మాస్టర్‌పై పైచేయి సాధించాడు. కాగా, కేఐఐటీ ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్‌‌లో గ్రాండ్ మాస్టర్ బోరిస్ సావ్చెంకో విజేతగా నిలిచాడు. ఫైనల్ రౌండ్‌లో భారత ప్లేయర్ సయంతన్ దాస్ జరిగిన పోరును డ్రా చేసి ఛాంపియన్‌గా నిలిచాడు.

Story first published: Tuesday, December 10, 2024, 9:08 [IST]
Other articles published on Dec 10, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+