For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ కప్: రెండో అతి పెద్ద వ్యూవర్ షిప్ మ్యాచ్‌గా అదేనంటూ ఐసీసీ వెల్లడి

By Nageswara Rao

ముంబై: భారత్-పాకిస్ధాన్ జట్ల మధ్య మ్యాచ్‌లకి క్రికెట్ అభిమానుల ఆదరణ అంతా ఇంతా కాదు. మైదానంలో ఇరు జట్ల మధ్య ప్రపంచ రికార్డులు బద్దలు కాకపోయినా, మ్యాచ్ వీక్షణలో మాత్రం రికార్డులు బద్దలవుతుంటాయి. అయితే ఐసీసీ వరల్డ్ కప్‌లో అత్యధిక మంది వీక్షకులు చూసిన మ్యాచ్‌‌గా భారత్-పాక్ మ్యాచ్ రికార్డులు సృష్టించింది.

ఇప్పటి వరకు జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌ను ఎక్కువ మంది వీక్షించిన రెండో అతిపెద్ద మ్యాచ్‌గా ఐసీసీ ప్రకటించింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ సమయంలో రేటింగ్ 12.9 వచ్చింది. ఇది దూరదర్శన్, స్టార్ నెట్ వర్క్‌లో ప్రసారం అయింది. ఈ మ్యాచ్ సమయంలో స్టార్ నెట్ వర్క్ రేటింగ్ 10.5గా, దూరదర్శన్ రేటింగ్ 2.4గా ఉంది.

ఈ మ్యాచ్‌ను ఏకంగా 257 మిలియన్ల క్రికెట్ అభిమానులు వీక్షించారు. గత నాలుగేళ్లలో ఇంత పెద్ద వ్యూవర్ షిప్ ఉన్న కార్యక్రమం ఏదీ లేదని ఐసీసీ వరల్డ్ కప్ నిర్వాహకులు తెలిపారు. 2011లో ముంబైలోని వాంఖడె స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్‌ను అత్యధిక మంది వీక్షకులు వీక్షించిన మ్యాచ్‌గా ఉంది.

257 million viewers tuned in to watch India-SA WC clash

257 మిలియన్ల క్రికెట్ అభిమానుల్లో 76 శాతం మంది అభిమానులు వ్యూవర్ షిప్ భారత్‌లోని హిందీ, తమిళం, బెంగాలీ, మళయాళం, కన్నడ భాషల్లో రాగా, ఒక్క ఇంగ్లీషు నుంచి మిగతా 24 శాతం వచ్చిందని తెలిపారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియా 130 పరుగుల తేడాతో విజయం సాధించింది.

స్టార్ ఇండియా సీఓఓ సంజయ్ గుప్తా మాట్లాడుతూ.. భారత అభిమానులు టీమీండియా పైన విశ్వాసంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు గాను 307 పరుగులు చేసింది. 308 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 40.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది.

ఈ మ్యాచ్‌లో సెంచరీ (146) చేసిన టీమిండియా బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక భారత్-పాకిస్ధాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను 288 మిలియన్ల మంది క్రికెట్ అభిమానులు వీక్షించిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+