
భారత్ నుంచి శివ్‌కేశవన్, జగదీష్
ఈ ఒలింపిక్స్‌లో భారత్ ఇద్దరు సభ్యుల జట్టుతో తన అదృష్టం పరీక్షించుకొంటోంది. భారత్ నుంచి శివ్‌కేశవన్, జగదీష్‌లు బరిలోకి దిగుతున్నారు. లుజ్‌లో కేశవన్, క్రాస్ కంట్రీ స్కీయింగ్‌లో జగదీష్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల సింగిల్స్ లుజ్ హీట్స్ ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో జరుగుతాయి. ఇక, జగదీష్ పోటీపడే 15 కిమీ నోర్దిక్ స్కీయింగ్ ఫ్రీస్టైల్ ఈవెంట్ ఫిబ్రవరి 16న జరుగుతుంది.

వింటర్ ఒలింపిక్స్‌కు ఎంతో ప్రత్యేకత
నిజానికి ఒలింపిక్స్ అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది సమ్మర్ ఒలింపిక్స్ మాత్రమే. అయితే వింటర్ ఒలింపిక్స్‌కు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వింటర్ ఒలింపిక్స్‌లో క్రీడలన్నీ మంచు కొండలు, లోయలు, మైదానాలే వేదికలుగా జరుగుతాయి. అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ఆధ్వర్యంలోనే... నాలుగేళ్లకొకసారి ఈ వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం 23వ వింటర్ ఒలింపిక్స్‌కు దక్షిణకొరియాలోని ప్యాంగ్‌చాంగ్ నగరం ఆతిథ్యమిస్తోంది.

మొత్తం 15 రకాల క్రీడల్లో పోటీలు
ఈసారి మొత్తం 15 రకాల క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ గేమ్స్‌లో భాగంగా నిర్వహించే మొత్తం 15 క్రీడాంశాల్లో ఐస్ హాకీ, ఆల్పైన స్కీయింగ్, బయోథ్లాన్, బాబ్ స్లీగీ, క్రాస్ కంట్రీ స్కీయింగ్, కర్లింగ్, ఫిగర్ స్కేటింగ్, ఫ్రీస్టయిల్ స్కేటింగ్, లూగే, నోరాడిక్ కంబైన్డ్, స్పీడ్ స్కేటింగ్, స్కెలిటన్, స్కీజంపింగ్, స్నోబోర్డింగ్ ఉన్నాయి. ఇందులో ఐస్ హాకీ, స్పీడ్ స్కేటింగ్, ఫిగర్ స్కేటింగ్, కర్లింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

30 ఏళ్ల తర్వాత ఆతిథ్యమిస్తోన్న ప్యాంగ్‌చాంగ్
సుమారు 30 ఏళ్ల తర్వాత ప్యాంగ్‌చాంగ్ నగరం ఈ వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తోంది. 2018లో కొరియా రాజధాని సియోల్ వేసవి ఒలింపిక్స్‌కు అతిథ్యమివ్వగా, ఆ తర్వాత మూడు దశాబ్దాల విరామం తర్వాత 2018 వింటర్ ఒలింపిక్స్‌కు ప్యాంగ్ చాంగ్ నగరం వేదికగా నిలిచింది.

మస్కట్లుగా మంచు పులి, ఏషియాటిక్ నల్ల ఎలుగుబంటి
ప్యాంగ్ చాంగ్ వింటర్ ఒలింపిక్స్‌కు దక్షిణ కొరియాలో ప్రముఖంగా కనిపించే మంచు పులి, ఏషియాటిక్ నల్ల ఎలుగుబంటిని మస్కట్లుగా నిర్ణయించారు. దీంతో సూహా రాంగ్ పేరుతో మంచుపులి, బాండాబీ పేరుతో నల్ల ఎలుగ ప్యాంగ్ చాంగ్ నగరంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా సందడి సందడి చేస్తున్నాయి.

జియో టీవీలో ప్రత్యక్ష ప్రసారం
ఈ వింటర్ ఒలింపిక్స్‌ను రిలయన్స్ జియో టీవీ యాప్.. జియో టీవీలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐఓసీ) తన వెబ్‌సైట్ ద్వారా ఒలింపిక్ చానెల్‌లో, యూట్యూబ్ ఛానెల్‌లో కూడా క్రీడలను ప్రసారం చేస్తోంది.

ఆరంభానికి ముందే రెపరెపలాడిన జాతీయ జెండా
కాగా, వింటర్ ఒలింపిక్స్ ఆరంభానికి ఒక రోజు ముందే ప్యాంగ్‌చాంగ్ ఒలింపిక్ స్టేడియంలో భారత జాతీయ జెండా రెపరెపలాడింది. జట్లను ఆహ్వానించే కార్యక్రమంలో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. 'క్రీడాగ్రామ మేయర్ భారత బృందాన్ని లాంఛనంగా ఆహ్వానించారు. ఆహ్వాన కార్యక్రమంలో భారత పతాకాన్ని ఎగురవేశారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉంది' అని భారత షెఫ్ ద మిషన్ హర్జిందర్ చెప్పాడు.


Click it and Unblock the Notifications











