Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నేనేంటో నిరూపించుకోవాల్సిన అవసర్లేదు'

2018 Commonwealth Games: Wrestling body in dark about Sushil Kumar’s fitness

హైదరాబాద్: తాను నిరూపించుకోవాల్సింది ఇంకా ఏమీ లేదని స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ అన్నాడు. ఐతే సాధించాల్సింది ఇంకా ఉందని చెప్పాడు. అసంపూర్తిగా మిగిలిపోయిన తన మూడో ఒలింపిక్‌ పతక కలను నెరవేర్చుకోవడానికి కామన్వెల్త్‌ క్రీడలు తొలి అడుగని అన్నాడు. కామన్వెల్త్‌లో పోటీ తన కెరీర్‌ను పొడిగిస్తుందని అతడు భావిస్తున్నాడు.

''రెజ్లింగ్‌ ఆరంభించినప్పటి నుంచి నా ఏకైక లక్ష్యం దేశానికి ప్రాతినిధ్యం వహించడం, మెరుగైన ప్రదర్శన చేయడమే. మ్యాట్‌పై ఎప్పుడూ నూరు శాతం శ్రమించా. నేను ప్రజల ఆలోచనా దృక్పథాన్ని మార్చలేను. నేను ఎవరికీ కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు'' అని సుశీల్‌ చెప్పాడు.

బీజింగ్‌లో కాంస్యం, లండన్‌లో రజతం సాధించిన సుశీల్‌.. వివాదాస్పద రీతిలో 2016 రియో ఒలింపిక్స్‌కు ఎంపిక కాని సంగతి తెలిసిందే. ఇప్పుడు కామన్వెల్త్‌ క్రీడలకు కూడా వివాదాల నడుమ ఎంపికయ్యాడు. ''నేను రెండు ఒలింపిక్‌ పతకాలు సాధించా. ఇక నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిందేమీ లేదు. కానీ నాకో అసంపూర్ణ కల ఉంది. 2012 (లండన్‌ ఒలింపిక్స్‌లో రజతం గెలిచాడు)లో దానికి దగ్గర వచ్చా. ఈ దేశానికి ఓ ఒలింపిక్‌ స్వర్ణం బాకీ పడ్డా'' అని సుశీల్‌ చెప్పాడు.

ఇటీవలే ఫిట్ నెస్ సమస్యతో బాధపడుతోన్న సుశీల్ కుమార్ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 4వరకు కెర్గిస్థాన్‌లో జరిగిన ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనలేకపోయాడు. రెజ్లింగ్ జాతీయ స్థాయి కోచ్ మాట్లాడుతూ.. సుశీల్ కుమార్ నేషనల్ క్యాంపు కార్యక్రమంలో పాల్గొనట్లేదని పేర్కొన్నాడు. అతను డోపింగ్ వివాదాలకు కూడా దూరంగానే ఉన్నాడని తెలిపాడు.

Story first published: Wednesday, March 21, 2018, 13:29 [IST]
Other articles published on Mar 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+