ఆసియా గేమ్స్‌: షూటర్ల గురి, రెజ్లర్ల పట్టుపైనే ఆశలన్నీ!

హైదరాబాద్: షూటింగ్‌కు భారత్ భవిష్యత్తు కేంద్రంగా తయారవుతుందనడంలో ఎటువంటి సందేహాం లేదు. మన యువ షట్లర్లు అంతర్జాతీయ స్థాయిలో అసమాన ప్రతిభతో సత్తా చాటుతున్నారు. పిన్న వయస్సులోనే అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఇండోనేషియా వేదికగా శనివారం నుంచి 18వ ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి.

ఈ నేపథ్యంలో షూటింగ్‌లో భారత్ 36 మందితో బరిలోకి దిగుతోంది. అంచనాలు అందుకుని గురి సరిగ్గా కుదిరితే షూటింగ్‌లో భారత్‌ ఎక్కువ పతకాలను సాధించే అవకాశం ఉంది. షూటింగ్‌లో కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలతో రాణించిన మను భాకర్, అనీశ్, ఎలావెనీల్‌పైనే క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

మనూ బాకర్

షూటింగ్ విభాగంలో పోటీపడుతున్న హర్యానాకు చెందిన మనూ బాకర్ 16 ఏళ్ల ప్రాయంలో ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌లో తన అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుని ఈ ఘనత సాధించిన పిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించింది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో సైతం గోల్డ్ మెడల్ అందుకున్న మనూ బాకర్ ఆసియా గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమైంది.

అనీశ్ భన్వాలా

అనీశ్ భన్వాలా

భారత షూటింగ్ భవిష్యత్తుకు దిక్సూచిలా అనీశ్ కనిపిస్తున్నాడు. హర్యానాలోని కర్నాల్‌లో 2002లో జన్మించిన అనీశ్ అతి తక్కువ కాలంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. 15 ఏళ్ల అనీశ్ భన్వాలా గతేడాది జాతీయ జట్టులోకి వచ్చాడు. షూటింగ్ జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 25మీటర్ల పిస్టల్, టీమ్‌ ఈవెంట్లలో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్య పతకాలు సాధించాడు. అదే జోరులో ఈ ఏడాది జరిగిన షూటింగ్ ప్రపంచకప్‌లో మూడు స్వర్ణాలు సహా గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్లకే పతకం సాధించిన తొలి భారత క్రీడాకారునిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

 ఎలావెనీల్ వాలరీవాన్

ఎలావెనీల్ వాలరీవాన్

తమిళనాడుకు చెందిన ఈ 19 ఏళ్ల షూటర్ ఈ ఏడాది జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ షూటింగ్‌లో స్వర్ణ పతకంతో ఎలావెనీల్ మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంటులో బరిలోకి దిగబోతున్న ఎలావెనీల్ పోడియం ఫినిష్ చేస్తుందన్న గట్టి నమ్మకముంది.

ఆసియా గేమ్స్‌లో భారత షూటింగ్ జట్టు:

సంజీవ్ రాజ్‌పుత్, అఖిల్ షెరాన్, రవికుమార్, దీపక్ కుమార్, హర్జిందర్‌సింగ్, అమిత్ కుమార్, అభిషేక్ వర్మ, సౌరభ్ చౌదరీ, శివమ్ శుక్లా, అనీశ్ భన్వాలా, లక్ష్యయ్ షెరాన్, మానవ్‌జీత్‌సింగ్ సంధు, షెరాజ్ షేక్, అంగద్‌వీరీ సింగ్, అంకుర్ మిట్టల్, శార్దుల్ విహాన్, మను భాకర్, అపూర్వి చండేలా, శ్రేయాసి సింగ్, అంజుమ్ మౌడ్గిల్, గాయత్రి, ఎలావెనీల్ వాలరీవాన్, హీనా సిద్ధు, రహీ సర్నోబత్, సీమ తోమర్, గానెమత్ సెకాన్, రష్మీ రాథోడ్, వర్ష వర్మన్.

 త్యధిక పతకాలు ఆశిస్తున్నది రెజ్లింగ్‌లోనే

త్యధిక పతకాలు ఆశిస్తున్నది రెజ్లింగ్‌లోనే

షూటింగ్ తర్వాత ఈసారి భారత్ అత్యధిక పతకాలు ఆశిస్తున్నది రెజ్లింగ్‌లోనే. రెజ్లింగ్ విభాగంలో మొత్తం 18 మంది రెజ్లర్లు ఆసియా క్రీడల్లో తలపడేందుకు సిద్ధమయ్యారు. ఇందులో 14 మంది కచ్చితంగా తమ తమ విభాగాల్లో పతకాలతో తిరిగి వచ్చే అవకాశముంది. స్టార్ రెజ్లర్లు సుశీల్‌కుమార్, బజ్‌రంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేశ్ పోగట్ పసిడి పతకాలను ముద్దాడే అవకాశాలున్నాయి.

సాక్షి మాలిక్

సాక్షి మాలిక్

రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించిన సాక్షి మాలిక్ ఆసియా క్రీడల్లో పతకం గెలవాలన్న కసితో ఉంది. గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్యంతో నిరాశపరిచిన ఈ హర్యానా రెజ్లర్ ఆసియా క్రీడల్లో పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకునేందుకు బరిలోకి దిగుతోంది. మహిళల ప్రీస్టెల్ 62 కిలోల విభాగంలో పోటీపడనుంది. మరోవైపు గోల్డ్‌కోస్ట్‌లో స్వర్ణంతో మెరుపులు మెరిపించిన వినేశ్ పోగట్(50కి) భారత్ తరఫున గట్టిపోటీదారునిగా కనిపిస్తోంది.

 బజరంగ్ పూనియా

బజరంగ్ పూనియా

ఆసియా క్రీడల్లో రెజ్లింగ్‌ విభాగంలో పోటీపడే హర్యానాకు చెందిన 24 ఏళ్ల బజరంగ్ పూనియా ఈ ఏడాది పాల్గొన్న మూడు టోర్నమెంట్లలో విజయం సాధించాడు. ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌ను సాధించాడు. ఆ తర్వాత జార్జియా, ఇస్తాంబుల్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో సైతం టైటిల్స్ సాధించాడు.

సుశీల్ కుమార్

సుశీల్ కుమార్

సుశీల్ కుమార్ ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచాడు. నాలుగేళ్ల తర్వాత ఇటీవల జార్జియాలో జరిగిన ఒక పోటీలో నిరాశపరిచాడు. ప్రస్తుతం ఆసియా క్రీడల్లో తప్పనిసరిగా భారత్‌కు పతకం అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. దీంట్లోనే మహిళల విభాగంలో పోటీ పడే మరో రెజ్లర్ వినేష్ ఫొగట్. రియో ఒలింపిక్స్ సందర్భంగా కాలి వేలికి తగిలిన దెబ్బతో సతమతమైంది. కామన్‌వెల్త్ గేమ్సలో గోల్డ్ మెడల్‌తోపాటు మాడ్రిడ్‌లోని స్పెయిన్‌లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్‌లో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇపుడు జకార్తాలో జరిగే ఆసియా గేమ్స్‌లో ఆమె 50 కేజీల విభాగంలో తప్పనిసరిగా మెడల్ సాధింస్తుందని అంటున్నారు.

ఆసియా గేమ్స్‌లో భారత రెజ్లింగ్ జట్టు:

పురుషుల ప్రీస్టెల్: సందీప్‌తోమర్(57కి), బజ్‌రంగ్ పూనియా(65కి), సుశీల్‌కుమార్(74కి), పవన్ కుమార్(86కి), మౌసమ్ ఖత్రీ(97కి), సుమిత్ మాలిక్(125కి), గ్రీకో-రోమన్: జ్ఞానేందర్(59కి), మనీశ్(67కి), గురుప్రీత్‌సింగ్(77కి), హర్‌ప్రీత్‌సింగ్(87కి), హర్‌దీప్‌సింగ్(97కి), నవీన్(130కి), మహిళల ఫ్రీైస్టెల్ టీమ్: సాక్షి మాలిక్(62కి), వినేశ్ పోగట్(50కి), పింకీ(53కి), పూజ ధండా(57కి), దివ్య కక్రాన్(68కి), కిరణ్(72కి).

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, August 17, 2018, 16:16 [IST]
Other articles published on Aug 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X