Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రయంట్ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణిస్తాడని 2012లోనే జోస్యం!!

Virat Kohli, Rohit Sharma & Others Response On Kobe Bryant Demise || Oneindia Telugu
2012 tweet had predicted Bryant death: Kobe is going to end up dying in helicopter crash

కాలిఫోర్నియా: మాజీ ఎన్‌బీఏ స్టార్‌, బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్ బ్రయంట్ ఆదివారం హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌లో హెలికాప్టర్‌ కుప్పకూలడంతో కోబ్‌ బ్రయింట్, ఆయన 13 ఏళ్ల కుమార్తె జియానా దుర్మరణం చెందారు. వీరితో పాటు మరో ఏడు మంది మృతి చెందారు. బ్రయంట్ వ్యక్తిగత హెలికాప్టర్‌ సికోర్సికీ ఎస్ 76 హెలికాఫ్టర్‌ లాస్‌ఏంజెల్స్‌లోని పశ్చిమాన ఉన్న ఓ కొండను ప్రమాదవశాత్తు ఢీకొంది. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం.

కోబ్‌ బ్రయంట్ దుర్మరణం చెందడంపై ఒక్కసారిగా క్రీడాలోకం షాక్‌కు గురైంది. అయితే ప్రస్తుతం బ్రయంట్ మరణంకు సంబందించిన ఓ వైరల్ ట్వీట్ కూడా అంతే షాక్‌కు గురిచేస్తోంది. 'బ్రయంట్ హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణిస్తాడు' అని డాట్ నోసో అనే ఓ ట్విట్టర్ యూసర్ 2012, నవంబర్ 14న ఓ పోస్ట్ చేసాడు. యాదృచ్చికంగా బ్రయంట్ అదే విధంగా తన ప్రాణాలను కోల్పోయాడు. 7 సంవత్సరాల క్రితం నోసో ఈ ట్వీట్ చేసాడు.

సోమవారం తెల్లవారుజామున బ్రయంట్ మరణ వార్త తెలియడంతో నోసో ఈ పోస్టుపై క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్రయంట్ అభిమానులు డాట్ నోసో జోస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నోసో చేసిన ఈ ట్వీట్ నిజమైన ట్వీటేనా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నోసో చెప్పినట్టే బ్రయంట్ మరణించడం విశేషం.

బ్రయంట్ మృతిచెందడానికి కొన్ని గంటల ముందు లీబ్రాన్‌ జేమ్స్‌ను కొనియాడుతూ ఓ ట్వీట్‌ చేసారు. ఇదే ఆయన చివరి ట్వీట్. 'నన్ను అధిగమించిన నా సోదరుడికి అభినందనలు. నా సోదరుడి పట్ల చాలా గౌరవం ఉంది. గేమ్‌ను మరింత ముందుకు తీసుకెళతావని ఆశిస్తున్నా కింగ్‌ జేమ్స్' అని ట్వీట్‌ చేశారు. #33644 అనే హ్యాష్ టాగ్ కూడా జత చేసారు. అమెరికా నేషనల్‌ బాల్ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ)లో అత్యధిక స్కోర్‌ చేసిన జాబితాలో మూడో స్థానంలో బ్రియాంట్‌ ఉండగా.. తాజాగా లీబ్రాన్‌ జేమ్స్‌ అతన్ని అధిగమించాడు. చివరి ట్వీట్‌కు 1.9 మిలియన్ లైకులు వచ్చాయి.

కొబ్ బ్రయంట్ బాస్కెట్‌బాల్ క్రీడలో ఎంతో సంపాదించారు. గతంలో ఫోర్బ్స్‌ ప్రకటించిన అత్యధిక ధనవంతుల క్రీడాకారుల జాబితాలో బ్రయంట్‌ చాలా సార్లు తన పేరును నిలుపుకున్నారు. బాస్కెట్‌బాల్‌ చరిత్రలో తన కంటూ బ్రయంట్ ఎన్నో రికార్డులు సృష్టించుకున్నారు. అయిదు సార్లు ఎన్‌బీఏ ఛాంపియన్‌గా నిలిచారు. 2008, 2012 ఒలింపిక్స్‌ల్లో అమెరికాకు స్వర్ణ పతకాలు సాధించడంలో బ్రియాంట్‌ది కీలకపాత్ర. రెండు దశాబ్దాలుగా బాస్కెట్‌బాల్‌లో మెరిసిన ఈ అమెరికా దిగ్గజం 2016లో రిటైర్మెంట్ ప్రకటించారు.

Story first published: Monday, January 27, 2020, 16:36 [IST]
Other articles published on Jan 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+