సచిన్ సెంచరీ: కివీస్ కు తొలి దెబ్బ

అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్సులో 520 పరుగులకు అలవుట్ అయింది. జహీర్ ఖాన్ 45 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. ఇది టెస్టుల్లో జహీర్ కు మూడో అర్థ సెంచరీ. ఈ అర్థ సెంచరీలో 8 ఫోర్లు ఉన్నాయి. మునాఫ్ పటేల్ ను 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెట్టోరీ అవుట్ చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్సు ముగిసింది. భారత్ న్యూజిలాండ్ పై 241 పరుగుల తొలి ఇన్నింగ్సు ఆధిక్యతను సాధించింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 160 పరుగులు చేశాడు. ఇందులో 26 ఫోర్లు ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోని 429 పరుగుల వద్ద 47 పరుగులు చేసి అవుటయ్యాడు. ధోనీతో కలిసి టెండూల్కర్ 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టెస్టుల్లో మ్యాచుల్లో టెండూల్కర్ 42 సెంచరీలు సాధించినట్లయింది. యువరాజ్ సింగ్ 22 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆయన 22 పరుగుల్లో నాలుగు ఫోర్లు ఉన్నాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications