For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దక్షిణాఫ్రికాపై భారత్ ఘోర పరాజయం

By Pratap
Hashim Amla
నాగపూర్: దక్షిణాఫ్రికాతో నాగపూర్ లో జరిగిన తొలి టెస్టు మ్యాచులో భారత్ ఘోరంగా పరాజయం పాలైంది. భారత్ ఇన్నింగ్సు 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ముందు భారత బ్యాట్స్ మెన్ వెలవెలబోయారు. తొలి ఇన్నింగ్సులో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ చేయడం, రెండో ఇన్నింగ్సులో సచిన టెండూల్కర్ సెంచరీ చేయడం మినహా భారత బ్యాటింగ్ విషయంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. రెండో ఇన్నింగ్సులో హర్బజన్ 39 పరుగులు,జహీర్ ఖాన్ 33 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్సులో భారత్ 319 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ల్ లో 7 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్ స్టెయిన్ రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 233 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్సును 558 పరుగులకు డిక్లేర్ చేసింది. ఫాలో ఆన్ ఆడిన భారత్ ఓటమిని తప్పించుకోలేకపోయింది.

భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టెస్టు మ్యాచుల్లో మంగళవారం తన 46వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ చేసిన వెంటనే అతను హరీస్ బౌలింగ్ అవుటయ్యాడు. భారతదేశంలో దక్షిణాఫ్రికాపై ఇది తొలి సెంచరీ కావడం విశేషం. దక్షిణాఫ్రికాపై జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఓటమి దిశగా పయనిస్తూనే ఉంది. సచిన్ టెండూల్కర్ ఒంటరి పోరాటం చేశాడు. ధోనీతో కలిసి దక్షిణాఫ్రికా బౌలర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు.

ఫాలో ఆన్ లో పడిన భారత్ రెండో ఇన్నింగ్సులోనూ విఫలమవుతూ వస్తోంది. సోమవారం అట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆరు వికెట్లు నష్టపోయి 209 పరుగులు చేసింది. ధోనీ 25 పరుగులకే అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన వీరేంద్ర సెహ్వాగ్ 16 పరుగులకే అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో స్టెయిన్ దెబ్బకు భారత్ 233 పరుగులకే అవుటయ్యింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+