For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సచిన్ అర్థ సెంచరీ: భారత్ స్కోర్ 278/4

By Staff
Sachin Tendulkar
హామీల్టన్: గురువారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు తన తొలి ఇన్నింగ్సులో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్సు స్కోరును సమం చేయడానికి భారత్ ఒక పరుగు దూరంలో ఉంది. వెలుతురు సరిగా లేకపోవడంతో గురువారం ఆటను నిర్ణీత సమయానికి ముందే ముగించారు. ఆట ముగిసే సమయానికి సచిన్ టెండూల్కర్ 70 పరుగులతో, యువరాజ్ సింగ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. టెండూల్కర్ 11 ఫోర్లతో ఈ పరుగులు సాధించాడు. టెండూల్కర్ టెస్టుల్లో 52వ అర్థ సెంచరీని సాధించాడు. మార్టిన్ కొత్త బంతితో వివియస్ లక్ష్మణ్ ను అవుట్ చేసిన తర్వాత టెండూల్కర్ తన అర్థ సెంచరీని పూర్తి చేశాడు.

లక్ష్మణ్ చేసిన 30 పరుగుల్లో నాలుగు ఫోర్లు ఉన్నాయి. అంతకు ముందు భారత్ స్కోర్ 177 పరుగుల వద్ద ఉన్నప్పుడు రాహుల్ ద్రావిడ్ ఇయాన్ ఒబ్రెయిన్ బౌలింగులో అవుటయ్యాడు. ద్రావిడ్ చేసిన 66 పరుగుల్లో 12 ఫోర్లు ఉన్నాయి. చూడ చక్కనైన షాట్లతో ద్రావిడ్ ప్రేక్షకులను అలరించాడు. లంచ్ విరామ సమయం తర్వాత భారత్ 142 పరుగుల వద్ద గౌతం గంభీర్ వికెట్ ను కోల్పోయింది. క్రిస్ మార్టిన బౌలింగులో 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గంభీర్ అవుటయ్యాడు. అంతకు ముందు 108 పరుగుల వద్ద భారత్ సెహ్వాగ్ వికెట్ ను కోల్పోయింది. 24 పరుగులు చేసిన సెహ్వాగ్ రన్నవుట్ అయ్యాడు. 29 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో భారత్ గురువారం తన తొలి ఇన్నంగ్సును ప్రారంభించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+