న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తండ్రిని ఎక్కించుకొని 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అమ్మాయికి బంపరాఫర్!

15-year-old Jyoti Kumari who cycled 1200 km carrying father offered trial by cycling federation


న్యూఢిల్లీ:
జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. బీహార్‌కు చెందిన 15 ఏళ్ల జ్యోతి కుమారి విషయంలో అదే జరిగింది. కరోనా కారణంగా దేశంలో విధించిన లాక్‌డౌన్‌తో ఆమె చేసిన ఓ సాహసం బంపరాఫార్‌ను తెచ్చిపెట్టింది. ఏకంగా సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ట్రయల్స్‌కు రమ్మని పిలుపువచ్చింది.
 గురుగ్రామ్ టూ బీహార్...

గురుగ్రామ్ టూ బీహార్...

బీహార్‌లోని దర్బాంగ్‌కు చెందిన జ్యోతి తన తండ్రితో కలిసి గురుగ్రామ్‌లో నివాసముంటుంది. ఆటో డ్రైవర్ అయిన తండ్రి గాయపడడమే కాకుండా లాక్‌డౌన్‌తో పనిలేకుండా పోయింది. పైగా ఇంటి యజమాని అద్దె చెల్లించమని ఒత్తిడి చేయడంతో వారు సోంతూరు వెళ్లాలని భావించారు. ఓ సైకిల్ కొనుగోలు చేసిన జ్యోతి.. వెనుక తన తండ్రిని కూర్చోబెట్టుకుని గురుగ్రామ్ నుంచి బీహార్‌కు ఏడు రోజుల్లో 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కింది. ఈ విషయాన్ని మీడియా వెలుగులోకి తేవడంతో ఆమె సాహసం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడితే ఆటగాడిగా మళ్లీ పుడతాం: బ్రావో

స్వయంగా ఫోన్ చేసి..

స్వయంగా ఫోన్ చేసి..

ఇక ఆమె ప్రతిభను గుర్తించిన ఐసీఎఫ్ అధికారులు జ్యోతికి స్వయంగా ఫోన్‌చేసి ట్రయల్స్ కోసం ఢిల్లీకి రమ్మని పిలిచారు. ట్రైనింగ్ అందిస్తామని ,ఇందుకు అయ్యే ఖర్చులను తామే భరిస్తామని చెప్పారు. ‘‘1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆమెలో అసాధ్యమైన ప్రతిభ ఉంది. ఏడు లేదా ఎనిమిది ప్రమాణాలను తాను దాటితే.. తను జాతీయ జట్టులోకి ఎంపిక అవుతుంది. అంతేకాక.. ట్రైనింగ్ సమయంలో తను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు'' అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.

రూ.500కు సైకిల్ కొని..

రూ.500కు సైకిల్ కొని..

తొలుత ఈ తండ్రి, కూతుళ్లు ఓ ట్రక్కు డ్రైవర్‌ను తమను గమ్య స్థానానికి చేర్చాలని కోరారు . అయితే అతను రూ. 6 వేలు డిమాండ్‌ చేశాడు. అంత డబ్బు లేక , ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో రూ. 500లకు ఓ సైకిల్‌ను కొన్నారు. ఇక మే 10వ తేదీన గురుగ్రామ్‌ నుంచి దర్భాంగకు సైకిల్‌పై బయల్దేరారు. అయితే మార్గమధ్యలో కేవలం రాత్రి సమయాల్లో 2 నుంచి 3 గంటలు మాత్రమే పెట్రోల్‌ బంకుల్లో విశ్రాంతి తీసుకునేవారు. మళ్ళీ ఇల్లు చేరాలనే సంకల్పం ఆమెను సైకిల్ తొక్కించింది. మే 16న సొంతూరికి రాగానే తండ్రీకూతుళ్లను క్వారంటైన్‌కు తరలించారు. ఇక వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది.

సచిన్ vs కోహ్లీ.. వన్డేల్లో ఎవరు గొప్పో చెప్పిన గంభీర్

Story first published: Friday, May 22, 2020, 8:52 [IST]
Other articles published on May 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X