Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

90 సంవత్సరాలుగా సైకిల్ తొక్కుతున్నాడు

106-Year-Old Record-Breaking Cyclist Hangs up His Helmet

హైదరాబాద్: యూత్! అమ్మా.. యూత్.. అంటూ సినిమాల్లో మోడ్రన్ డ్రస్సులో ముదురు బెండకాయలు కనిపిస్తుంటే అందరం నవ్వుకుంటాం. కానీ, అలాంటి 106ఏళ్ల వ్యక్తి సైకిలింగ్ చేస్తే.. అదీ మామూలుగా కాదు. రేస్‌లో పాల్గొంటే... సరిగ్గా అదే జరిగింది.


రికార్డు బ్రేకింగ్ వ్యక్తి ఫ్రాన్స్‌ సైక్లిస్ట్‌ రాబర్ట్‌ మర్చండ్‌. అతను 106 ఏళ్ల వయస్సు లో ఆ క్రీడకు గుడ్‌బై చెప్పాడు. సైక్లింగ్‌ అంటే విపరీతమైన అభిమానం ఉన్న అతను గత ఏడాదే విరామాన్ని ప్రకటించాడు.

22.528 కి.మీ. (14.08 మైళ్లు) దూరాన్ని 105ఎస్‌ విభాగంలో కేవలం గంటలో చేరుకున్నాడు. ఈ ఘటన చూసిన వాళ్లే కాదు. తెలుసుకున్న వాళ్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే చాలామంది ఈ సమయాన్ని ఆ వయో విభాగంలో వరల్డ్‌ రికార్డుగా భావిస్తారు.

పారిస్‌లోని ఓ ఇండోర్‌ పార్క్‌లో జరిగిన ఆ పోటీ ప్రపంచవ్యాప్తంగా మీడియాను విశేషంగా ఆకర్షించింది. ప్రొఫెషనల్‌ సైక్లిస్ట్‌గా రాబర్ట్‌ 90 ఏళ్లకుపైగా కొనసాగడం మరో విశేషం.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 11, 2018, 10:00 [IST]
Other articles published on Jan 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+