Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

10 ఏళ్లకే ప్రపంచ చాంపియన్‌గా పాలవాడి కొడుకు..!

శాన్ డియోగో: శుభమ్ జగ్లాన్ ఈ పేరు ప్రస్తుతం అంతర్జాతీయంగా సంచలం సృష్టిస్తోంది. 10 ఏళ్ల ఈ భారతీయ కుర్రాడు అమెరికాలో వెల్క్ రిసార్ట్ ఫౌంటైన్ కోర్సులో జరిగిన జూనియర్‌ వరల్డ్ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు.

మూడు రోజుల పాటు సాగిన అండర్-17 గోల్ఫ్ చాంపియన్ షిప్ ఈవెంట్‌లో 179 పాయింట్లు సాధించి జూనియర్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా అవతరించాడు. గతేడాది ఇదే ఈవెంట్‌‌లో రన్నరప్‌గా నిలిచాడు. గోల్ఫ్ అనేది సంపన్న క్రీడగా అందరూ భావిస్తుంటారు.

కానీ శుభమ్ జగ్లాన్ తండ్రి పాలమ్ముకునే ఓ సాధారణ వ్యక్తి. హర్యానా రాష్ట్రంలో పానిపట్‌లోని ఇసానా గ్రామంలో జగ్లాన్ తండ్రి ఓ పాల వ్యాపారి. చిన్నప్పటి నుంచి గోల్ఫ్‌పై ఉన్న అభిమానంతో తండ్రి పోలాన్నే గోల్ఫ్ కోర్సుగా చేసుకుని ప్రాక్టీస్ చేసేవాడు.

10-year-old son of Haryana milkman wins Junior World Golf Championship

గోల్ఫ్‌కు సంబంధించి ఆటలో మెళకువలను కంప్యూటర్‌లో యూట్యూబ్ వీడియోలు చూస్తే నేర్చుకునేవాడు. ఆ క్రమంలో తన గ్రామానికి సమీపంలో ఓ ఎన్నారై ఏర్పాటు చేసిన గోల్ఫ్‌ రేంజ్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ జగ్లాన్‌, దాదాపు వంద టోర్నీల్లో విజేతగా నిలిచాడు.

ఈ విషయం తెలుసుకున్న భారత మాజీ గోల్ఫర్‌ నోనితా లాల్‌ ఖురేషి స్వయంగా వెళ్లి జగ్లాన్‌ను కలిశారు. అనంతరం అతడిని 'ది గోల్ఫ్‌ ఫెడరేషన్‌' సహకారంతో జగ్లాన్‌ కుటుంబం ఢిల్లీకి మారేలా ఒప్పించింది. మూడేళ్ల పాటు లుటేరా శిక్షణలో గోల్ఫ్‌కు సంబంధించిన అన్ని మెళకువలను శుభమ్ జగ్లాన్ నేర్చుకున్నాడు.

ప్రపంచ జూనియర్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌ గెలిచిన అనంతరం శుభమ్ జగ్లాన్ 'చివరకు నేను సాధించాను. జూనియర్ గోల్ఫ్‌లో అన్ని అత్యుత్తమ టోర్నమెంట్లకు సంబంధించిన అవార్డులను సొంతం చేసుకున్నాను' అని పేర్కొన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+