న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దూసుకెళ్లిన యూపీ, దబంగ్‌ ఢిల్లీ జట్లు

U Mumba vs UP Yoddha HIGHLIGHTS, PKL 6, Eliminator 1: UP Yoddha secure spot in Eliminator 3

కొచ్చి: ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌లో యూపీ యోధ, దబంగ్‌ ఢిల్లీ జట్లు మూడో ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు అర్హత సాధించాయి. ప్రొ కబడ్డీ లీగ్‌లో ఫేవరెట్‌ యు ముంబాపై యూపీ యోధ అనూహ్య విజయం సాధించింది. ప్రొ కబడ్డీ ఆరో సీజన్‌ లీగ్‌ దశలో అద్భుత ఆటతీరుతో టైటిల్‌ ఫేవరేట్‌గా కనిపించిన యు ముంబా కథ ముగిసింది. ప్లే ఆఫ్‌లో ఓడిన ఆ జట్టు ఇంటి దారి పట్టింది. ఆదివారం జరిగిన తొలి ఎలిమినేటర్‌ పోరులో యోధ 34-29తో యు ముంబాపై గెలుపొందింది.

ట్యాక్లింగ్‌లో యూపీ ఆటగాడు నితేశ్‌ కుమార్‌ (8) చెలరేగడంతో ముంబాకు ఓటమి తప్పలేదు. రెండో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో దబాంగ్‌ ఢిల్లీ 39-28తో బెంగాల్‌ వారియర్స్‌ను ఓడించింది. క్వాలిఫయర్‌-2లో చోటు కోసం యూపీ, ఢిల్లీ అమీతుమీ తేల్చుకో నున్నాయి. మరోవైపు ఎలిమినేటర్‌- 2 మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 39-28తో బంగాల్‌ వారియర్స్‌పై గెలిచి ముందంజ వేసింది. ఢిల్లీ తరపున నవీన్‌ కుమార్‌ (11), చంద్రన్‌ రంజిత్‌ (8) రాణించారు.

సోమవారం జరిగే క్వాలిఫయర్‌-1లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో బెంగళూరు బుల్స్, ఎలిమినేటర్‌-3లో యూపీ యోధతో దబంగ్‌ ఢిల్లీ తలపడనున్నాయి. క్వాలిఫయర్‌-1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మాత్రం ఎలిమినేటర్‌-3 విజేత జట్టుతో జనవరి 3న క్వాలిఫయర్‌-2లో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ విజేత ఫైనల్లో రెండో బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది.

యూ ముంబా
డిఫెండర్లు:

Surender Singh, Anil, Fazel Atrachali, Hadi Tajik, Dharmaraj Cheralathan, Rajaguru Subramanian, Rohit Rana, Adinath Sakharam Gavali
రైడర్లు:
Gaurav Kumar, Abolfazl Maghsoudloumahali, Vinod Kumar, Darshan Kadian, R. Sriram, Siddharth Sirish Desai, Arjun Deshwal, Abhishek Singh, Rohit Balyan
ఆల్ రౌండర్లు:
E. Subash, Shiv Om, Mohit Balyan

యూపీ యోధా
డిఫెండర్లు:

Nitesh Kumar, Pankaj, Jeeva Kumar, Sachin Kumar, Nitin Mavi, Vishav Chaudhary, Amit
రైడర్లు:
Azad Singh, Sulieman Kabir, Shrikant Jadhav, Rishank Devadiga, Prashant Kumar Rai, Rohit Kumar Choudhary, Bhanu Pratap Tomar
ఆల్ రౌండర్లు:
Sagar B. Krishna, Seong Ryeol Kim, Arkam Shaikh, Narender

Story first published: Monday, December 31, 2018, 8:45 [IST]
Other articles published on Dec 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X