For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రాగా ముగిసిన తలైవాస్, స్టీలర్స్ పోరు, ముంబాపై బుల్స్ విజయం

U Mumba vs Bengaluru Bulls LIVE score and updates, Pro Kabaddi League 2018: U Mumba beat Bulls 32-29

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో బుధవారం తమిళ్‌ తలైవాస్‌, హరియాణా స్టీలర్స్‌ మధ్య చివరి నిమిషం దాకా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌ 32-32తో డ్రాగా ముగిసింది. ప్రథమార్ధంలో 19-15తో హరియాణా పైచేయి సాధించినప్పటికీ.. ద్వితీయార్ధంలో తలైవాస్‌ పుంజుకుంది. 27-27 వద్ద ఆ జట్టు స్కోరు సమం చేసింది. ఒక దశలో తలైవాస్‌ 31-29తో విజయానికి చేరువగా వెళ్లింది.

ఐతే చివరి 3 నిమిషాల్లో స్టీలర్స్‌ చక్కటి ప్రదర్శనతో స్కోరు సమం చేసింది. తలైవాస్ జట్టులో సుఖేశ్‌ (7 పాయింట్లు), అజయ్‌ ఠాకూర్‌ (6) రాణించగా.. హరియాణా తరఫున వికాస్‌ (14) అదరగొట్టాడు.

హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో ప్రథమార్ధంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 32-29తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. ముంబా 17-6తో ఆధిక్యంలో నిలవగా.. రెండో అర్ధంలో బుల్స్‌ పుంజుకుని గట్టి పోటీ ఇచ్చింది. కానీ చివరికి విజయం ముంబానే వరించింది. దర్శన్‌ 9 రైడ్‌ పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ముంబా జట్టులో దర్శన్‌ (9), సురేందర్‌ (5), ఫజల్‌ (5) రాణించారు. బెంగళూరు తరఫున పవన్‌ (8), రోహిత్‌ (6), కాశిలింగ్‌ (4) మెరిశారు. తమిళ్‌ తలైవా్‌స-హరియాణా స్టీలర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ 32-32తో టైగా ముగిసింది.

Story first published: Thursday, November 15, 2018, 11:10 [IST]
Other articles published on Nov 15, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+