ముంబా విన్: అలియా, ధోనీ కత్రినా సందడి (పిక్చర్స్)
ముంబై: ప్రో కబడ్డీ - 2015 ట్రోఫీని యు ముంబా గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో బెంగళూరు బుల్స్‌ను 36-30 పాయంట్ల తేడాతో ఓడించి విజయం సాధించింది. లీగ్ దశలో 60 పాయంట్లు సంపాదించి అగ్రస్థానాన్ని ఆక్రమించిన యు ముంబాకు ఫైనల్‌లో బుల్స్ నుంచి గట్టిపోటీ ఎదురైంది.
చివరి వరకూ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. గత ఏడాది చేజారిన ట్రోఫీని యు ముంబై ఈసారి చేజిక్కించుకుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ నుంచే ఆధిపత్యం చలాయిస్తూ వచ్చినప్పటికీ ఫైనల్లో మాత్రం గట్టి పోటీనే ఎదురయింది. ఇరు జట్ల డిఫెన్స్ పటిష్టంగా ఉండటంతో పాయింట్లు అంత తేలిగ్గా రాలేదు.
మొదటి 15 నిమిషాలు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. 7-7తో స్కోరు సమమైన స్థితిలో యు ముంబా రైడర్లు అనూప్ కుమార్, షబీర్ బాపు దూకుడు పెంచారు. బుల్స్‌ను ఆలౌట్ చేసి తొలి సగం ముగిసేసరికి తమ జట్టుకు 16-8 ఆధిక్యాన్ని అందించారు.
ఓ దశలో బెంగళూరు బుల్స్ కెప్టెన్ మన్‌జీత్ చిల్లర్ వరుసగా పాయింట్లు సాధించడం, అజయ్ ఠాకూర్ సూపర్ రైడ్ చేయడంతో ముంబా ఆలౌటై.. 34వ నిమిషానికి 23-24తో ఓ పాయింటు వెనుకంజ వేసింది. ఆ తర్వాత మళ్లీ యు ముంబై పుంజుకుంది. మన్‌జీత్ మినహా మరో ఆటగాడు ప్రభావం చూపలేకపోయాడు.

యు ముంబా
యు ముంబా వర్సెస్ బెంగళూరు బుల్స్ మధ్య తుది పోరు సమయంలో సైఫ్ అలీ ఖాన్, అలియా భట్, ఎమ్మెస్ ధోనీ, కత్రినా కైఫ్ సందడి చేశారు. అలియా భట్ జాతీయ గీతాన్ని ఆలపించారు.

యు ముంబా
ప్రో కబడ్డీ తుది పోరులో బెంగళూరు బుల్స్‌ను ఓడించి ట్రోఫీ దక్కించుకున్న యు ముంబా ఆటగాళ్ల ఆనందం దృశ్యం.

పాట్నా పైరేట్స్ వర్సెస్ తెలుగు వారియర్స్
అంతకుముందు మూడు నాలుగు స్థానాల కోసం జరిగిన పోరులో పాట్నా పైరేట్స్ పైన తెలుగు టైటాన్స్ గెలిచి మూడో స్థానంలో నిలిచింది.

ట్రోఫీ
నాలుగు రోజుల క్రితం... సెమీ ఫైనల్లోకి వచ్చిన పాట్నా పైరెట్స్, యు ముంబా, బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ జట్ల కెప్టెన్లు ట్రోఫీతో...
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications