న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుర్ఖాలో మహిళల కబడ్డీ మ్యాచ్ చూసేందుకు వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు

By Nageshwara Rao
Thailand Women's Kabaddi Team's Male Coach Wears Hijab To Watch Matches During Asian Championship In Iran

హైదరాబాద్: మహిళల కబడ్డీ మ్యాచ్ చూసేందుకు బుర్ఖాలో వెళ్లిన అడ్డంగా దొరికిపోయాడు థాయిలాండ్‌‌కు చెందిన ఓ మేల్ కోచ్. ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ ఘటన జరిగింది. థాయ్‌లాండ్ పురుషుల కబడ్డీ జట్టుకు చెందిన కోచ్‌గా గుర్తించారు.

అతడు బుర్ఖా వేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. థాయ్ స్పోర్ట్స్ కిట్ వేసుకొని మ్యాచ్‌కు రావడంతో ఇరాన్ మీడియా అతన్ని గుర్తించింది. ఈ ఘటనను ఇరాన్ కబడ్డీ ఫెడరేషన్ చాలా సీరియస్‌గా పరిగణించింది.

దీంతో వెంటనే అతడు అందరి సమక్షంలో క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది. ఇది ఆతిథ్య దేశ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని ఇరాన్ స్పష్టం చేసింది. నిజానికి ఇరాన్‌లో మహిళలు ఆడే ఏ మ్యాచ్‌లనైనా పురుషులు, మీడియా చూడకుండా అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది.

దీంతో ఇది మహిళలను కించపరచడమే అవుతుందని, సదరు కోచ్ క్షమాపణ చెప్పాల్సిందేనని ఇరాన్ ఫెడరేషన్ తేల్చి చెప్పింది. దీంతో థాయి కోచ్ క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే థాయి కోచ్ బుర్ఖా వేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Story first published: Thursday, November 30, 2017, 15:47 [IST]
Other articles published on Nov 30, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X