Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pro Kabaddi 2024 : యూ ముంబాతో తలపడనున్న తెలుగు టైటాన్స్..

ప్రొ కబడ్డీ లీక్(KPL)2024లో భాగంగా బుధవారం రాత్రి మ్యాచ్ నెంబర్ 66లో తెలుగు టైటాన్స్ యూ ముంబాతో పోటీ పడనుంది. నోయిడా ఇండోర్ స్టేడియంలో రాత్రి 9 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి. యూ ముంబా పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. ఈ జట్టు ఏడు మ్యాచ్‌లు గెలిచి, మూడు ఓడిపోయి, ఒక మ్యాచ్‌లో టైగా ముగిచింది. యూ ముంబా మంచి ఫామ్ లో ఉంది. చివరి ఆరు మ్యాచ్‌లలో ఐదింటిలో విజయం సాధించారు.

మరోవైపు తెలుగు టైటాన్స్ కూడా ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన చేస్తూ వచ్చింది. ఆడిన 10 మ్యాచ్‌లలో ఆరింటిలో విజయం సాధించిఏడో స్థానంలో ఉన్నారు. గత మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ 49-27తో హర్యానా స్టీలర్స్‌పై విజయం సాధించింది. మరో మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీ గుజరాత్ జెయిట్స్ తో తలపడనుంది. నోయిడా ఇండోర్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఇరు జట్లు పోటీ పడనున్నాయి. దబాంగ్ ఢిల్లీ 11 మ్యాచ్ ల్లో ఐదింటిలో విజయం సాధించిగా.. మరో ఐదు మ్యాచుల్లో ఓటమి పాలయింది.

Telugu Titans to take on U Mumba in Pro Kabaddi League KPL 2024

ఒక మ్యాచ్ ను టైగా ముగిచి ఆరో స్థానంలో ఉంది. గుజరాత్ జెయిట్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆడిన 10 మ్యూచ్ ల్లో కేవలం రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. కాగా మంగళవారం నొయిడా వేదికగా మంగళవారం జరిగిన పుణెరి పల్టాన్ వర్సెస్ యూపీ యోధాస్ మ్యాచ్ టై అయింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఇరు జట్లు 29-29 స్కోరుతో సమంగా నిలిచాయి. మరో మ్యాచ్ లో బెంగళూరు బుల్స్‌పై పట్నా పైరేట్స్ 54-31 పాయింట్ల తేడాతో గెలిచింది.

ప్రొ కబడ్డీ లీక్(KPL)2024 పాయింట్ల పట్టికలో హార్యానా స్టీలర్స్ ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. 11 మ్యాచ్ ల్లో 8 మ్యాచ్ లు గెలిచింది. యూ ముంబా రెండో స్థానంలో ఉండగా.. పాట్నా పైరేట్స్ మూడో స్థానంలో ఉంది. పుణేరి పల్టాన్స్ నాలుగు, జైపూర్ పింక్ పాంథర్స్ ఐదో స్థానంలో కొనసాగుతోన్నాయి. దబాంగ్ ఢిల్లీ ఆరు, తెలుగు టైటాన్స్ ఏడు, తమిళ్ తళైవాస్ 8వ స్థానంలో ఉండగా.. చివరి స్థానంలో యూపీ యోధాస్ ఉంది.

Story first published: Wednesday, November 20, 2024, 9:30 [IST]
Other articles published on Nov 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+