యుపి యోధాతో 'ఢీ': తెలుగు టైటాన్స్ తలరాత మారేనా?
హైదరాబాద్: అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్‌ల్లో ప్రో కబడ్డీ లీగ్ ఒకటి. గత వారమే ఈ లీగ్ ఐదో సీజన్ ఘనంగా ప్రారంభమైంది. లీగ్‌లో భాగంగా మంగళవారం తెలుగు టైటాన్స్ కొత్తగా లీగ్‌లోకి వచ్చిన యుపి యోధాతో తలపడనుంది. లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కి ఇది నాలుగో మ్యాచ్.
యుపి యోధా, తెలుగు టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. అయితే ఆరంభ మ్యాచ్‌లో శుభారంభం చేసినప్పటికీ ఆ తర్వాత డబుల్ డిఫెండింగ్ చాంపియన్స్ పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ చేతిలో తెలుగు టైటాన్స్ ఓటమి పాలై తీవ్ర ఒత్తిడిలో ఉంది.

బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు అలసిపోయినట్టు కనిపించారు. అయితే సోమవారం విశ్రాంతి లభించడంతో నాలుగో మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సీజన్‌లో కెప్టెన్ రాహుల్ చౌదరిపైనే టైటాన్స్ ఎక్కువగా ఆధారపడుతోంది.
మరోవైపు రాత్రి 9 గంటలకు దబాంగ్ ఢిల్లీ, కొత్తగా వచ్చిన గుజరాత్ ఫార్చూన్‌జెయింట్స్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications