
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ 2021 - 2022లో తెలుగు టైటాన్స్ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు లీగ్‌లో టైటాన్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడినప్పటికీ టైటాన్స్ జట్టు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. దీంతో తెలుగు టైటాన్స్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో బుధవారం జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ గెలిచి అభిమానులు ఊపిరి పీల్చుకునేలా చేసింది.
అంతేకాకుండా ఈ సీజన్‌లో తెలుగు టైటాన్స్ విజయాల ఖాతా తెరిచింది. జైపూర్ పింక్ పాంథర్స్‌తో మ్యాచ్‌లో చివరి క్షణం వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఒక్క పాయింట్ తేడాతో విజయం సాధించింది. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సమయానికి స్కోర్లు 35-34గా నమోదయ్యాయి.
తెలుగు టైటాన్స్ జట్టులో ఆదర్శ్ 9, రజనీష్ 7 రైడింగ్ పాయింట్లతో రాణించారు. సురేందర్ సింగ్ 4, రాకేష్ 3, అంకిత్, రాజ్ రెండేసి పాయింట్లు సాధించారు. ఇక జైపూర్ జట్టులో అర్జున్ దేశ్వాల్ 13 పాయింట్లతో సత్తా చాటాడు. దీపక్ హుడా 8, విశాల్ 4 పాయింట్లు సాధించారు. అమిత్, కుమార్, సందీప్ రెండేసి పాయింట్లు సాధించారు. అయితే ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తెలుగు టైటాన్స్ స్థానంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 ఓడిన టైటాన్స్ ఒకటి గెలిచి, రెండు టై చేసుకుంది. దీంతో మొత్తం 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.
ఇక మరో మ్యాచ్‌లో పుణేరి పల్టాన్‌పై హర్యాణా స్టీలర్స్ విజయం సాధించింది. హోరాహోరిగా సాగిన ఈ పోరులో పుణేపై హర్యాణా 37-30 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. హర్యాణా జట్టులో వికాస్ 8, మోహిత్, జయదీప్ ఏడేసీ పాయింట్లు సాధించారు. మీత్, ఆశిష్ రెండేసి పాయింట్లు సాధించారు.
ఇక పుణే జట్టులో విశ్వాస్ 7, నితీన్ తోమర్ 5, అస్లాం 4, సాంకేత్ 3, సోంబిర్ 2 పాయింట్లు సాధించారు. ఇక నేడు జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవస్ తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్, పాట్నా పైరేట్స్ తలపడనున్నాయి. రాత్రి 8:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.