ఎన్నారైల ఆటల పోటీలు (పిక్చర్స్)
డల్లాస్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాంటెక్స్), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సంయుక్తంగా కబడ్డీ, టెన్నికాయట్, త్రోబాల్ పొటీలను టాంటెక్స్ స్పోర్ట్స్ ప్రతినిధి వెంకట్ దండ, తానా స్పోర్ట్స్ ప్రతినిధి సాయి లింగ, వారి బృంద కార్యనిర్వహణలో ఎంతో విజయవంతంగా జరిపించారు. చాలా మంది తెలుగు కుటుంబాలు వారి పిల్లలతో సహా ఉత్సాహంతో పాల్గొన్నారు.
పచ్చిక బయలు, నీటి కొలనులు మరియు అన్ని హంగులు కలిగినటువంటి కొపెల్ నగరంలోని ఆండ్రు బ్రౌన్ పార్క్ ఈ అటలపొటీలకు ఆథిద్యాన్నిచ్చింది. టాంటెక్స్ అద్యక్షులు విజయ మోహన్ కాకర్ల క్రీడాకారులకు స్వాగతం పలికి, మన గ్రామీణ క్రీడలలో పాల్గొనేందుకు వచ్చిన అందరిని అభినందించారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు పాల్గొనడం ఈ పొటీలకు వన్నె తెచ్చిందన్నారు.
తానా ప్రాంతీయ ప్రతినిధి రాజేష్ అడుసుమిల్లి మాట్లాడుతూ - క్రీడలు మానసిక వికాసానికి తోడ్పడతాయన్నారు. తెలుగు వారి అభ్యున్నతికి తానా ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందన్నారు. క్రీడాకారులు తమ చిన్ననాటి అనుభూతులను గుర్తుచేసుకుంటూ ఎంతో ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు.
కబడ్డీ పోటీలో టాంటెక్స్ కప్ ను భీమసేన జట్టు, తానా కప్ ను ఆష్టదిగ్గజాలు జట్టు గెల్చుకున్నాయి. టెన్నికాయట్ పోటీలో టాంటెక్స్ కప్ ను కపెల్ కిలాడి జట్టు, తానా కప్ ను కపెల్ కౌగర్ల్ జట్టు గెల్చుకున్నాయి. త్రోబాల్ పోటీలో టాంటెక్స్ కప్ ను మాధవి దివి, నితీష కర్నాటి, తానా కప్ ను జాన్సి చామకూర, శాంతి గున్న గెల్చుకున్నారు. టాంటెక్స్, తానా సభ్యులు విజేతలను అభినందించారు. ఈ ఆటల పొటీలను ఘనంగా నిర్వహించిన స్వచ్చంద కార్యకర్తల సేవలను కొనియాడారు.

త్రోబాల్ ఇలా..
టాంటెక్స్, తానా సంయుక్తంగా నిర్వహించిన ఆటల పోటీల్లో భాగంగా త్రో బాల్ ఆడుతున్న మహిళా క్రీడాకారురులు

తానా ఆధ్వర్యంలో...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‌లో క్రీడాకారులు ఇలా కనిపించారు.

కబడ్డీ పోటీలు...
పోటీల్లో భాగంగా కబడ్డీ ఆడుతున్న ఎన్నారై క్రీడాకారులు. ఈ ఆటలో ఎన్నారైలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

జట్లు ఇలా
ఎన్నారై క్రీడాకారుల ఇలా కనిపించారు. వారితో పాటు పిల్లలు, ఇతర ఎన్నారైలు ఇలా కనిపించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications