Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తమిళ్‌ తలైవాస్‌ చేతిలో తెలుగు టైటాన్స్‌ పరాజయం

Pro kabaddi 2018 : Tamil Thalaivas Bags First Win Over Telugu Titans | Oneindia Telugu
Tamil Thalaivas Defeat Telugu Titans for First Time in PKL

అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో చరిత్రలో తొలిసారిగా తమిళ్‌ తలైవాస్‌ చేతిలో తెలుగు టైటాన్స్‌ పరాజయం పాలైంది.మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తలైవాస్ 27-23తో టైటాన్స్‌ను ఓడించింది. రైడింగ్‌లో అజయ్ ఠాకూర్ 8 పాయింట్లు సాధించగా, కీలక సమయంలో మంజీత్ చిల్లర్ మూడు ట్యాకిల్ పాయింట్లు కొల్లగొట్టి తలైవాస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

మరోవైపు రాహుల్ చౌదరి రైడింగ్ (8 పాయింట్లు)లో అదరగొట్టినా.. చెత్త డిఫెన్స్‌తో మూల్యం చెల్లించుకుంది. ఐదో నిమిషంలో ఇరు జట్లు 4-4తో సమంగా ఉన్నా, అద్భుత ట్యాక్లింగ్‌తో 4 పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వెళ్లారు. తొలి భాగం ముగిసేసరికి తలైవాస్‌ 13-6తో నిలిచింది. రెండో భాగంలో పుంజుకొన్న టైటాన్స్‌... ప్రత్యర్థి స్కోరును అందుకునేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది.

టైటాన్స్ మ్యాచ్ మొత్తంలో కేవలం 7 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఆరంభం నుంచే ఆధిక్యం చూపెట్టిన తలైవాస్ తొలి అర్ధభాగానికి 18-10తో ముందంజ వేసింది. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకుని విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 29-26తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ను ఓడించింది.

గుజరాత్‌ తరఫున సచిన్‌ (9 పాయింట్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ జట్టులో మిరాజ్‌ షేక్‌ (7 పాయింట్లు) అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. మిగిలిన ప్లేయర్లు నవీన్ (5), రవీందర్ (4), రాజేశ్ (3) రాణించారు. గుజరాత్ జట్టుకు సచిన్ (9), పర్వేష్ (6), సునీల్ (3), డోంగ్ (3) పాయింట్లు అందించారు. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్‌ తలైవాస్‌తో పట్నా పైరేట్స్, యు ముంబాతో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ ఆడతాయి.

Story first published: Wednesday, November 21, 2018, 9:18 [IST]
Other articles published on Nov 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+