Pro Kabaddi: తమిళ్ తలైవస్ విధ్వంసం.. ఆలౌట్లతో ప్రత్యర్థి ఉక్కిరి బిక్కిరి

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ 8లో తమిళ్ తలైవస్ సత్తా చాటుతుంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా హర్యాణా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తలైవస్ ఏకపక్షంగా విజయం సాధించింది. చివరి వరకు హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీని జైపూర్ పింక్ పాంథర్స్ ఓడించింది.

తమిళ్ తలైవస్ తడాఖా
హర్యాణా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవస్ జట్టు చెలరేగి ఆడింది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన తలైవస్ చివరి వరకు అదే ఆటను కొనసాగించింది. కెప్టెన్ సుర్జీత్ సింగ్, సాగర్, మంజీత్ చెలరేగి ఆడడంతో ఫస్టాఫ్‌లోనే హర్యాణాను రెండు సార్లు ఆలౌట్ చేసింది. ఆ తర్వాత హర్యాణా కూడా పుంజుకున్నప్పటికీ ఫస్టాఫ్ ముగిసే సమయానికి తమిళ్ తలైవసే అధిక్యంలో నిలిచింది. 24-18తో బ్రేక్‌కు వెళ్లింది.
సెకాండాఫ్‌లోనూ తమిళ్ తలైవస్ ఏ మాత్రం తగ్గలేదు. తన విధ్వంసకర ఆట తీరుతో సెకండాఫ్‌లోనూ హర్యాణాను రెండు సార్లు ఆలౌట్ చేసింది. చివరికి మ్యాచ్‌ను 46-25 తేడాతో సుయాసంగా చేజిక్కించుకుంది. హర్యాణాపై తమిళ్ తలైవస్ ఘనవిజయం సాధించింది. ఆ జట్లులో మంజీత్ 10, సుర్జీత్ 8, సాగర్ 7 పాయింట్లతో సత్తా చాటారు. ఇక హర్యాణా జట్టులో వికాశ్ 9 పాయింట్లతో రాణించాడు.

ఉత్కంఠగా జైపూర్ vs ఢిల్లీ పోరు
జైపూర్ పింక్ పాంథర్స్, దబాంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మరో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. 30-28 తేడాతో దబాంగ్ ఢిల్లీపై జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. జైపూర్ జట్టులో దీపక్ హుడా 9, కుమార్ 8, అర్జున్ దేశ్వాల్ 7 పాయింట్లు సాధించారు. దబాంగ్ ఢిల్లీ జట్టులో అశ్ మాలిక్ 8, నవీన్ కుమార్ 7 పాయింట్లతో రాణించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో జైపూర్ ఆరో స్థానానికి చేరుకోగా, హర్యాణా ఎనిమిదో స్థానంలో ఉంది.

పాయింట్ల పట్టిక
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 32 పాయింట్లతో దబాంగ్ ఢిల్లీ మొదటి స్థానంలో, 29 పాయింట్లతో పాట్నా పైరేట్స్ రెండో స్థానంలో ఉంది. 28 పాయింట్లతో బెంగళూరు బుల్స్ మూడో స్థానంలో ఉంది. ఈ మూడు జట్లు కూడా ఐదేసి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.

నేటి మ్యాచ్‌లు
పాట్నా పైరేట్స్ vs యు ముంబా- రాత్రి 7:30 గంటలకు
తెలుగు టైటాన్స్ vs గుజరాత్ జెయింట్స్- రాత్రి 8:30 గంటలకు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications