న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొలిరోజు మెరిశారు: రెండో రౌండ్‌లోకి సాయి ప్రణీత్, ప్రణయ్

Sai Praneeth, Prannoy make winning start at World Championships
హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత షట్లర్లు మెరిశారు. పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ రెండో రౌండ్‌కు అర్హత సాధించారు.

<strong>స్మిత్‌ను ఎగతాళి చేసిన ఇంగ్లీషు అభిమానులపై ఆసీస్ ప్రధాని మండిపాటు<br></strong>స్మిత్‌ను ఎగతాళి చేసిన ఇంగ్లీషు అభిమానులపై ఆసీస్ ప్రధాని మండిపాటు

19వ ర్యాంకు ఆటగాడైన సాయి ప్రణీత్‌ కెనడాకు చెందిన 66వ ర్యాంకు ఆటగాడు ఆంథోనీ హో షూపై 21-17, 21-16 తేడాతో వరుస గేముల్లో విజయం సాధించాడు. మరో పురుషుల సింగిల్స్ పోరులో మరో షట్లర్‌ హెచ్ ఎస్ ప్రణయ్‌ గెలుపు కోసం పోరాడాల్సి వచ్చింది.

ఫిన్లాండ్‌కు చెందిన 93వ ర్యాంకర్ యూటు హీనోపై 17-21, 21-10, 21-11 తేడాతో నెగ్గాడు. తొలి గేమ్‌ చేజార్చుకున్న ప్రణయ్ ఆ తర్వాత రెండు గేముల్లో తన అనుభవాన్ని ఉపయోగించి గేమ్‌లతో పాటు మ్యాచ్‌ని కూడా సొంతం చేసుకున్నాడు.

56 బంతుల్లో సెంచరీ: 28 ఏళ్ల వరకూ చెక్కు చెదరని రికార్డు

ఇక, మహిళల డబుల్స్‌లో మేఘనా జక్కంపూడి, పూర్వీషా రామ్‌ 21-10, 21-18 తేడాతో గ్వాటెమాల జోడీ డయానా కార్లెటో, నిక్తె అల్గెజాండ్రపై విజయం సాధించారు. ఏడో సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌, పదో సీడ్‌ సమీర్‌ వర్మ పురుషుల సింగిల్స్‌లో పోటీ పడాల్సి ఉంది.

Story first published: Monday, August 19, 2019, 19:39 [IST]
Other articles published on Aug 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X