మళీ పుంజుకున్న తెలుగు టైటాన్స్, పుణెను దెబ్బతీసిన గుజరాత్


హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పుంజుకుంది. ఈ సీజన్లో నెమ్మదిగా సాగుతున్న టైటాన్స్.. తొలిసారి ఆధిపత్యం ప్రదర్శిస్తూ విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన జోన్-బి పోరులో టైటాన్స్ 53-32తో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ ఆరంభంలో రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు ఆడాయి. రైడర్లు పాయింట్లు తేవడంలో పోటీపడడంతో మ్యాచ్ 5-5తో సమానంగా సాగింది. 9-6తో ఆధిక్యంలో నిలిచింది. కానీ రాహుల్ చౌదరి మెరవడంతో టైటాన్స్ పుంజుకుంది.
ప్రదీప్ నర్వాల్ సూపర్ రైడ్లు సాధించడంతో 17-10తో ఆధిక్యంలోకి వెళ్లిన టైటాన్స్.. 29-20తో విజయం దిశగా సాగింది. రెండో అర్ధభాగంలో దూకుడుగా ఆడిన టైటాన్స్.. 35-22తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ఈ క్రమంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 46-29తో నిలిచిన టైటాన్స్.. చివర్లో నీలేశ్ మరో సూపర్ రైడ్ చేయడంతో 52-32తో విజయాన్ని ఖరారు చేసుకుంది.

దుమ్మురేపుతూ రాహుల్ చౌదరీ 17 పాయింట్లు
దీంతో మొత్తం 21 పాయింట్లతో జోన్-బిలో టాప్‌లో కొనసాగుతుండగా, 17 పాయింట్లతో పాట్నా నాలుగో స్థానానికి పరిమితమైమంది. మ్యాచ్ విషయానికొస్తే..స్టార్ రైడర్ రాహుల్ చౌదరీ(17) రైడింగ్‌లో దుమ్మురేపగా, డిఫెన్స్‌లో విశాల్ భరద్వాజ్ 9 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి పుణె జట్టులో రైడింగ్‌లో వికాస్ జలన్(9), డిఫెన్స్‌లో జైదీప్(2) రాణించారు.

మ్యాచ్ మొదటి నిమిషంలోనే పాయింట్
మ్యాచ్ మొదటి నిమిషంలోనే పాట్నా స్టార్ రైడర్ పర్‌దీప్ నార్వల్..ప్రత్యర్థి ఆటగాన్ని ఔట్ చేయకుండానే లాబీలోకి వెళ్లి టైటాన్స్‌కు పాయింట్ సమర్పించుకున్నాడు. ఓవైపు రాహుల్ చౌదరి దూకుడైన రైడింగ్‌కు తోడు విశాల్ భరద్వాజ్ ఉడుంపట్టుతో ప్రథమార్ధం ముగిసేసరికి టైటాన్స్ 25-17తో ఆధిక్యంలో నిలిచింది.

37-27తో పుణెరి పల్టాన్‌ను ఓడించి:
జోన్-ఎ మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చ్యున్ జెయింట్స్ 37-27తో పుణెరి పల్టాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ ఆరంభంలో నితిన్ తోమర్ విజృంభించడంతో పుణెరికి శుభారంభం లభించింది. మూడో నిమిషంలో అతను రెండు రైడ్ పాయింట్లు తేవడంతో పుణెరి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ట్యాక్లింగ్‌లో సత్తాచాటిన గుజరాత్ నెమ్మదిగా స్కోరు పెంచుకుంది. 13వ నిమిషంలో నితిన్ రైడింగ్‌లో విఫలం కావడంతో గుజరాత్ 10-8తో ఆధిక్యంలో నిలిచింది.

100 పాయింట్లు సాధించిన తొలి రైడర్‌గా
అర్ధభాగం ముగిసే సమయానికి గుజరాత్ 16-12తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. 34వ నిమిషంలో రింకు రెండు పాయింట్లు తీసుకురావడంతో 26-30తో గుజరాత్ స్కోరుకు సమీపంగా వచ్చింది పుణెరి. ఈ క్రమంలోనే నితిన్ తోమర్ ఈ సీజన్లో 100 పాయింట్లు సాధించిన తొలి రైడర్‌గా నిలిచాడు. అయితే అతను గాయం కారణంగా చివర్లో వైదొలగడం పుణెరిని దెబ్బ తీసింది. దీంతో జోరు కొనసాగించిన గుజరాత్ 37-27తో విజయాన్ని అందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications