Pro Kabaddi: మళ్లీ ఓటమి బాట పట్టిన తెలుగు టైటాన్స్.. జైపూర్, తలైవస్ మ్యచ్ టై

బెంగళూరు: చివరి మ్యాచ్‌లో గెలిచి లీగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసిన తెలుగు టైటాన్స్ ఇంతలోనే మళ్లీ నిరాశపరిచింది. తాజాగా యు ముంబాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఓటమి పాలైంది. దీంతో టైటాన్స్ మళ్లీ ఓటమి బాట పట్టింది. చూస్తుంటే ఈ ఏడాది పాయింట్ల పట్టికలో తెలుగు టైటాన్స్ చిట్ట చివరి స్థానాన్ని ఖరారు చేసుకున్నట్టు కనిపిస్తోంది. మరో మ్యాచ్‌లో బెంగళూరును పుణే ఓడించగా.. జైపూర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

టైటాన్స్ ఓటమి
తెలుగు టైటాన్స్‌పై యు ముంబా 42-35 తేడాతో విజయం సాధించింది. యు ముంబా జట్టులో అభిషేక్ సింగ్ 15 పాయింట్లతో చెలరేగాడు. మిగతా వారిలో రాహుల్, ఫజేల్ ఆరేసి పాయింట్లు సాధించారు. ఇక అజిత్ కుమార్ 5, మోహ్సేత్ 2 పాయింట్లు సాధించారు. తెలుగు టైటాన్స్ జట్టులో ఆదర్శ్ 12 పాయింట్లతో సత్తా చాటాడు. మిగతా వారిలో రజ్నీష్ దలాల్ 5, సురీందర్ సింగ్, సందీప్ నాలుగేసి పాయింట్లు సాధించారు. అంకిత్ బేనివాల్ 3 పాయంట్లను ఖాతాలో వేసుకున్నాడు.

పుణే గెలుపు
అంతకు ముందు జరిగిన మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ను పుణేరి పల్టాన్ ఓడించింది. 37-35 తేడాతో పుణే విజయం సాధించింది. పుణే జట్టులో మోహిత్ గోయత్ 13, అస్లాం 6, సోంబిర్ 5, నితిన్ 4, సంకేత్ 2 పాయింట్లు సాధించారు. ఇక బెంగళూరు జట్టులో పవన్ కుమార్ 10, భరత్ 6, దీపక్ నర్వాల్ 4, చంద్రన్ రంజిత్, నందాల్ మూడేసి పాయింట్లు సాధించారు.

మ్యాచ్ టై
జైపూర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవస్ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జట్లు చివరి వరకు పోటా పోటీగా తలపడడంతో 34-34తో మ్యాచ్ టై అయింది. తమిళ్ తలైవస్ జట్టులో అజింక్యా పవార్ 15, మంజీత్ 12 పాయింట్లతో సత్తా చాటారు. మిగతా వారిలో మోహిత్, కృష్ణ, సాగర్ తలో పాయింట్ సాధించారు. ఇక జైపూర్ పింక్ పాంథర్స్ అర్జున్ దేశ్వాల్ 15 పాయింట్లతో సత్తా చాటాడు. మిగతా వారిలో చౌదరి 5, నితిన్, సందీప్ ధుల్ మూడేసి, కుమార్ ఒక పాయింట్ సాధించాడు.

నేటి మ్యాచ్‌లు
యూపీ యోధా వర్సెస్ హర్యాణా స్టీలర్స్- రాత్రి 7:30 గంటలకు
తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్- రాత్రి 8:30 గంటలకు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications