తొడగొట్టిన భళ్లాలదేవ: కబడ్డీ ప్రచారకర్తగా రానా(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రో కబడ్డీ సీజన్-3కి ప్రచారకర్తగా ఎంపికవడం ఆనందంగా ఉందని టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా అన్నాడు. 'అందరం కబడ్డీ ఆడుతూ పెరిగాం. ఐతే టీవీల్లో క్రికెట్‌ను చూసినంతగా కబడ్డీ చూడలేదు. ప్రొ కబడ్డీతో ఆట పట్ల ఆసక్తి పెరిగింది' అని తెలిపాడు. ఈ సందర్భంగా ప్రోమో వీడియోను ఆవిష్కరించి రానాతోపాటు ఆటగాళ్లు తొడగొట్టారు.
కాగా, తెలుగు టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి మాట్లాడుతూ.. ప్రో కబడ్డీ తన జీవితాన్నే మార్చేసిందని అన్నాడు. ప్రో కబడ్డీకి ముందు తన గురించి తమ బస్తీలోనే ఎవరికీ తెలియదనీ.. లీగ్ విజయవంతం కావడంతో ప్రముఖుడిగా మారిపోయానని రాహుల్ తెలిపాడు.
'ఓసారి విజయనగరం వెళ్లినప్పుడు.. అక్కడ నాకు అభిమానులు ఎవరుంటారులే అనుకున్నా. అయితే అతి కష్టంమీద అభిమానుల మధ్య నుంచి బయటపడ్డా. ఒకప్పుడు నన్నెవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు బ్రహ్మరథం పడుతుండటం ఆనందంగా ఉంది' అని రాహుల్ చెప్పాడు.

కబడ్డీ ప్రచారకర్తగా రానా
ప్రో కబడ్డీ సీజన్-3కి ప్రచారకర్తగా ఎంపికవడం ఆనందంగా ఉందని టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా అన్నాడు.

కబడ్డీ ప్రచారకర్తగా రానా
‘అందరం కబడ్డీ ఆడుతూ పెరిగాం. ఐతే టీవీల్లో క్రికెట్‌ను చూసినంతగా కబడ్డీ చూడలేదు. ప్రొ కబడ్డీతో ఆట పట్ల ఆసక్తి పెరిగింది' అని తెలిపాడు.

కబడ్డీ ప్రచారకర్తగా రానా
తెలుగు టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి మాట్లాడుతూ.. ప్రో కబడ్డీ తన జీవితాన్నే మార్చేసిందని అన్నాడు.

కబడ్డీ ప్రచారకర్తగా రానా
ప్రో కబడ్డీకి ముందు తన గురించి తమ బస్తీలోనే ఎవరికీ తెలియదనీ.. లీగ్ విజయవంతం కావడంతో ప్రముఖుడిగా మారిపోయానని రాహుల్ తెలిపాడు.

కబడ్డీ ప్రచారకర్తగా రానా
ఈ సందర్భంగా ప్రోమో వీడియోను ఆవిష్కరించి రానాతోపాటు ఆటగాళ్లు తొడగొట్టారు.

కబడ్డీ ప్రచారకర్తగా రానా
‘ఓసారి విజయనగరం వెళ్లినప్పుడు.. అక్కడ నాకు అభిమానులు ఎవరుంటారులే అనుకున్నా. అయితే అతి కష్టంమీద అభిమానుల మధ్య నుంచి బయటపడ్డా. ఒకప్పుడు నన్నెవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు బ్రహ్మరథం పడుతుండటం ఆనందంగా ఉంది' అని రాహుల్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications