For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెంగాల్‌కు బ్రేక్.. దనాధన్ ఢిల్లీదే విజయం

కోల్‌కతా: సొంతగడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపుమీదున్న బెంగాల్‌ వారియర్స్‌ జోరుకు దబంగ్‌ ఢిల్లీ కళ్లెం వేసింది. ఆదివారం జరిగిన అంతర్‌ జోన్‌ వైల్డ్‌కార్డు మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 37-31 తేడాతో బెంగాల్‌పై విజయం సాధించింది. ఇప్పటికే జోన్‌- ఎ నుంచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన ఢిల్లీ విజయంతో గ్రూప్‌ దశను ముగించింది. మణిందర్‌ సింగ్‌ (9) తొలి రైడ్‌లోనే మూడు పాయింట్లు తేవడంతో బెంగాల్‌ మ్యాచ్‌ను దూకుడుగా ఆరంభించింది.

వెంటనే పుంజుకున్న ఢిల్లీ 7-7తో స్కోరు సమం చేసి బెంగాల్‌కు ధీటైన జవాబిచ్చింది. ఇక అక్కడి నుంచి మిరాజ్‌ షేక్‌ (13) మాయ మొదలైంది. వరుస పాయింట్లతో చెలరేగిన మిరాజ్‌ తొలి అర్ధభాగం ముగిసే సరికి ఢిల్లీకి 20-14తో ఆధిక్యాన్ని అందించాడు. విరామం తర్వాత సూపర్‌ ట్యాకిళ్లతో పాయింట్లు రాబట్టిన బెంగాల్‌ 22-22తో స్కోరును సమం చేసి పోటీలోకి వచ్చినట్లు కనిపించింది.

రెండు జట్లు పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడడంతో ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది. చివరి రెండు నిమిషాల ఆట ఉందనగా 31-31తో మ్యాచ్‌ టై అయ్యేలా కనిపించింది. ఢిల్లీ తరఫున మిరాజ్‌ షేక్‌ 13 పాయింట్లతో మెరవగా... బెంగాల్‌ వారియర్స్‌ తరఫున మణీందర్‌ 9, భూపేందర్‌ 5 పాయింట్లు సాధించారు. అయితే మిరాజ్‌ సూపర్‌ రైడ్‌తో పాయింట్లు తెచ్చి ఢిల్లీని విజేతగా నిలిపాడు.

జోన్‌- బి నుంచి బంగాల్‌ ప్లేఆఫ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. లీగ్‌లో సోమవారం విశ్రాంతి రోజు. మంగళవారం జరుగనున్న మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో తమిళ్‌ తలైవాస్, బెంగాల్‌ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడనున్నాయి.

Story first published: Monday, December 24, 2018, 9:40 [IST]
Other articles published on Dec 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+