పాంథర్స్- టైటాన్స్ మ్యాచ్ థ్రిల్లింగ్ డ్రా: అర్జున్ డ్యాన్స్
హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్‌లో సొంతగడ్డ హైదరాబాద్‌లో మంగళవారం పింక్ ఫాంథర్స్‌తో జరిగిన మ్యాచును తెలుగు టైటాన్స్ ఉత్కంఠ మధ్య డ్రాగా ముగించింది. చివరి క్షణం వరకు హోరాహోరీగా సాగిన పోరులో ఇరుజట్ల ఆటగాళ్ళు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో ప్రొ కబడ్డీకే ఈ మ్యాచ్ హైలైట్‌గా నిలిచింది.
ఇరుజట్లకు మూడేసి పాయింట్లు లభించాయి. 29 పాయింట్లతో టైటాన్స్ పట్టికలో ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇది రెండో డ్రా. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ జాతీయ గీతాలాపన చేసి.. సొంతగడ్డపై టైటాన్స్ పోరుకు తెరతీశాడు. ఈ సందర్భంగా ఆయన సరదాగా డ్యాన్స్ కూడా చేశారు.
కాగా, ప్రథమార్ధమంతా టైటాన్స్ ఆటగాళ్ళ అద్భుతమైన రైడింగ్.. దుర్భేధ్యమైన డిఫెన్స్‌తో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. రాహుల్ (14), సుఖేష్ (9) పోటీపడి రైడింగ్ పాయింట్లు సంపాదించడం.. హాది, దీపక్, సందీప్‌లకు డిఫెన్స్‌లో తిరుగులేకపోవడంతో పాంథర్స్ ఆలౌటవడానికి ఎంతోసేపు పట్టలేదు. అయితే ద్వితీయార్ధంతో పరిస్థితి మారిపోయింది.
సోను నర్వాల్(13) వరుసగా పాయింట్లు రాబడుతుండటంతో పాంథర్స్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. రాజేశ్ (7), జస్వీర్ (4) కూడా రైడింగ్‌లో రాణించడంతో ఈ మ్యాచ్‌లో టైటాన్స్ తొలిసారిగా ఆలౌటైంది. ఆ సమయంలోనూ టైటాన్స్ 29-27తో ఆధిక్యంలో ఉంది. కొద్దిసేపటికే సోను రెండు, జస్వీర్ ఒక పాయింటు రాబట్టడంతో 31-31తో స్కోరు సమమైంది. ఇరుజట్ల ఆటగాళ్ళు హోరాహోరీగా తలపడటంతో 33 పాయింట్ల వద్ద మరోసారి స్కోరు సమమైంది.
ఆఖరి ఐదు నిమిషాల్లో మ్యాచ్ మరింత రసవత్తరంగా సాగింది. పాంథర్స్ పట్టుదలగా ఆడటంతో టైటాన్స్ మరోసారి ఆలౌటై 35-39తో వెనుబడింది. ఇక టైటాన్స్ ఓటమి ఖాయమే అనిపించింది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా సుఖేష్ వరుసగా రెండు పాయింట్లు సంపాదించడం.. కూతకొచ్చిన పాంథర్స్ ఆటగాడు రాజేశ్‌ను సందీప్ ఒడిసిపట్టుకోవడంతో ఆశలు చిగురించాయి.

పాంథర్స్- టైటాన్స్ మ్యాచ్
ప్రో కబడ్డీ లీగ్‌లో సొంతగడ్డ హైదరాబాద్‌లో మంగళవారం పింక్ ఫాంథర్స్‌తో జరిగిన మ్యాచును తెలుగు టైటాన్స్ ఉత్కంఠ మధ్య డ్రాగా ముగించింది.

పాంథర్స్- టైటాన్స్ మ్యాచ్
చివరి క్షణం వరకు హోరాహోరీగా సాగిన పోరులో ఇరుజట్ల ఆటగాళ్ళు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో ప్రొ కబడ్డీకే ఈ మ్యాచ్ హైలైట్‌గా నిలిచింది.

పాంథర్స్- టైటాన్స్ మ్యాచ్
ఇరుజట్లకు మూడేసి పాయింట్లు లభించాయి. 29 పాయింట్లతో టైటాన్స్ పట్టికలో ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది.

పాంథర్స్- టైటాన్స్ మ్యాచ్
ఈ సీజన్‌లో ఇది రెండో డ్రా. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ జాతీయ గీతాలాపన చేసి.. సొంతగడ్డపై టైటాన్స్ పోరుకు తెరతీశాడు.

అల్లు అర్జున్ డ్యాన్స్
ఈ సీజన్‌లో ఇది రెండో డ్రా. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ జాతీయ గీతాలాపన చేసి.. సొంతగడ్డపై టైటాన్స్ పోరుకు తెరతీశాడు. ఈ సందర్భంగా ఆయన సరదాగా డ్యాన్స్ కూడా చేశారు.

అల్లు అర్జున్, శ్రీకాంత్ జాతీయ గీతాలపన
ఈ సీజన్‌లో ఇది రెండో డ్రా. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ జాతీయ గీతాలాపన చేసి.. సొంతగడ్డపై టైటాన్స్ పోరుకు తెరతీశాడు. ఈ సందర్భంగా ఆయన సరదాగా డ్యాన్స్ కూడా చేశారు.

పాంథర్స్- టైటాన్స్ మ్యాచ్
ప్రథమార్ధమంతా టైటాన్స్ ఆటగాళ్ళ అద్భుతమైన రైడింగ్.. దుర్భేధ్యమైన డిఫెన్స్‌తో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది.

అల్లు అర్జున్ అభివాదం
రాహుల్ (14), సుఖేష్ (9) పోటీపడి రైడింగ్ పాయింట్లు సంపాదించడం.. హాది, దీపక్, సందీప్‌లకు డిఫెన్స్‌లో తిరుగులేకపోవడంతో పాంథర్స్ ఆలౌటవడానికి ఎంతోసేపు పట్టలేదు. అయితే ద్వితీయార్ధంతో పరిస్థితి మారిపోయింది.
తర్వాతి రైడ్‌లో రాహుల్ విజయవంతమవడంతో 39-39తో స్కోరు సమమైంది. ఆ సమయంలో పాంథర్స్ జట్టులో మిగిలింది ఇద్దరే. కూతకు వెళ్ళిన జస్వీర్ మ్యాచ్ ముగిసే వరకు రైడింగ్ కొనసాగించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరో మ్యాచ్‌లో యు ముంబా 29-25తో దబాంగ్ ఢిల్లీని చిత్తుచేసింది. ఈ సీజన్‌లో యు ముంబాకు వరుసగా ఇది 8వ విజయం. 40 పాయింట్లతో యు ముంబా పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications