For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండో మ్యాచ్‌లోనూ తెలుగు టైటాన్స్‌ ఓటమి.. సత్తాచాటిన రాహుల్‌ చౌదరీ

Pro Kabaddi League 2019 : Tamil Thalaivas Defeat Telugu Titans || Oneindia Telugu
Pro Kabaddi League season 7: Tamil Thalaivas defeat Telugu Titans, Gujarat Fortunegiants crush Bengaluru Bulls

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7లో తెలుగు టైటాన్స్‌ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. సొంత ప్రేక్షకుల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 26-39 స్కోరుతో తమిళ్‌ తలైవాస్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. గత కొంత కాలంగా తెలుగు టైటాన్స్‌కు ఆడిన స్టార్ రైడర్ రాహుల్‌ చౌదరీ ఈ సారి ప్రత్యర్థిగా మారి దెబ్బ కొట్టాడు.

రాహుల్‌ షో:

రాహుల్‌ షో:

ఈ పోరులో టైటాన్స్‌ మొదటి పది నిమిషాలే తలైవాస్‌కు పోటీ ఇవ్వగలిగింది. తొలి నిమిషంలోనే రాహుల్‌ తలైవాస్‌కు పాయింట్ సాధించాడు. అయితే 4వ నిమిషంలో టైటాన్స్‌ సూపర్‌ టాకిల్‌ చేసి స్కోర్‌ను 3-4కు తగ్గించింది. టెటాన్స్‌ స్టార్‌ రైడర్‌ సిద్ధార్థ్‌ మొదటి పాయింట్‌ను సాధించడానికి చాలా సమయం తీసుకున్నాడు. తొలి 10 నిమిషాల ఆట ముగిసేసరికి టైటాన్స్‌ 7-6తో ఆధిక్యంలో నిలిచింది. ఈ సమయంలో తలైవాస్‌ ఆటగాడు షబీర్‌ బాపు సూపర్‌ టాకిల్‌, రెండు రైడ్‌ పాయింట్లు తెచ్చాడు.

నిరాశపరిచిన సిద్ధార్థ్‌ దేశాయ్‌:

ఇక 16వ నిమిషంలో రాహుల్‌ రెండు రైడ్‌ పాయింట్లు సాధించాడు. 18వ నిమిషంలో కెప్టెన్ అజయ్‌ థాకూర్‌ సూపర్‌ రైడ్‌ చేయడంతో మొదటి అర్ధభాగం ముగిసే సరికి తలైవాస్‌ 20-10తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో టైటాన్స్‌ ఆట తీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. మరోవైపు ఆటగాళ్లు పాయింట్ల కోసం శ్రమించినా తలైవాస్‌ పటిష్టమైన డిఫెన్స్‌ను చేధించడంలో సఫలం కాలేకపోయారు. చివరి ఐదు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా 20-32తో వెనకబడి ఓటమిని ఖాయం చేసుకుంది. తలైవాస్‌ ఆటగాడు మంజిత్‌ చిల్లర్‌ (6) ట్యాక్లింగ్‌లో చెలరేగాడు. 13 సార్లు రైడ్‌కు వెళ్లి కేవలం 5 పాయింట్లే సాధించిన సిద్ధార్థ్‌ దేశాయ్‌ మరోసారి నిరాశపరిచాడు.

 గుజరాత్‌ బోణి:

గుజరాత్‌ బోణి:

ఏడో సీజన్‌ను గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ మంచి విజయంతో ఆరంభించింది. గుజరాత్‌ 42-24 తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. రైడింగ్‌లో సచిన్‌ (7), ట్యాక్లింగ్‌లో సునీల్‌ కుమార్‌ (6) రాణించి గుజరాత్‌ జట్టుకు విజయాన్ని అందించారు. మరోవైపు బెంగళూరు జట్టులో పవన్‌ సెరావత్‌ (8) ఆకట్టుకున్నాడు. ఈ రోజు యు ముంబాతో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌, పుణేరి పల్టన్‌తో హరియాణా స్టీలర్స్‌ తలపడతాయి.

Story first published: Monday, July 22, 2019, 11:42 [IST]
Other articles published on Jul 22, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+