తెలుగు టైటాన్స్ 'హ్యాట్రిక్' ఓటమి.. వారియర్స్ ఘన విజయం

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7లో తెలుగు టైటాన్స్ జట్టు వరుస ఓటముల పరంపరను కొనసాగిస్తోంది. సొంతగడ్డపై విజయాలతో అభిమానులను అలరిస్తుందనుకున్న టైటాన్స్ ఇప్పటివరకు ఒక్క విజయం అందుకోలేకపోయింది. బుధవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 33-34 తేడాతో దబాంగ్ ఢిల్లీ చేతిలో పోరాడి ఓడింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విఫలమయి హ్యాట్రిక్ ఓటములతో టోర్నీలో వెనుకంజలో ఉంది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

ఆధిక్యంలో:
టైటాన్స్ తరపున సూరజ్ దేశాయ్ (18), దబంగ్ తరపున నవీన్ కుమార్ (14) మ్యాచ్ ఆరంభం నుంచే సత్తా చాటడంతో స్కోర్లు సమమౌతూ వచ్చాయి. ఇదే ఊపులో తొలి అర్ధ భాగాన్ని టైటాన్స్ 14-13 ఆధిక్యంతో ముగించింది. విరామం తర్వాత కూడా రెండు జట్లు పాయింట్లలో పోటీ పడ్డాయి. ఐతే 31వ నిమిషంలో రైడ్‌కు వెళ్లిన సూరజ్.. బోనస్ సహా నాలుగు పాయింట్లు తేవడంతో టైటాన్స్ ఒక్కసారిగా 28-26తో ఆధిక్యంలో నిలిచింది.

ఒక్క పాయింటే:
మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో జోగిందర్ శర్మ సూపర్ ట్యాకిల్ చేసి దిల్లీని 29-28తో ఆధిక్యంలో నిలిపాడు. అక్కడి నుంచి టైటాన్స్ పోరాడినా.. ఢిల్లీ అవకాశం ఇవ్వలేదు. మరో రెండు నిమిషాల ఆట మాత్రమే మిగిలి ఉందనగా.. టైటాన్స్ 32-33తో ఢిల్లీ స్కోరును సమీపించింది. టైటాన్స్ రైడర్ అర్మాన్‌ను జోగిందర్ పట్టడంతో దిల్లీ 34-32తో నిలిచింది. చివరి మూడు సెకన్లు ఉందనగా రైడ్‌కు వెళ్లిన సూరజ్.. కేవలం ఒక్క పాయింటే తేవడంతో టైటాన్స్ ఓడిపోయింది. టైటాన్స్ తరపున సూరజ్ దేశాయ్ 15 సార్లు రైడింగ్‌కు వెళ్లి 18 పాయింట్లు తెచ్చాడు. డిఫెండర్లలో జోగిందర్ నర్వాల్ (4), రవీందర్ పహల్ (3) రాణించారు.

చిత్తుగా యూపీ:
అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధ 17-48తో బెంగాల్ వారియర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. బెంగాల్ తరఫున మహ్మద్ నబీబక్ష్(10), బల్‌దేవ్ సింగ్(7) రాణించారు. డిఫెండర్లు కూడా సత్తా చాటారు. యూపీ యోధ తరఫున మోను గోయత్ (6).. సురేందర్ సింగ్, నితీశ్ కుమార్ చెరో 3 పాయింట్లు చేశారు. గురువారం జరిగే మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీతో తమిళ్ తలైవాస్ తలపడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications