Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాట్నా పైరెట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా 'నీతూ చంద్ర'

Pro Kabaddi League season 7: Actress Neetu Chandra Brand Ambassador for Patna Pirates

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 7లో పాట్నా పైరెట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ హీరోయిన్ నీతూ చంద్ర వ్యవహరించనుంది. ఈ మేరకు జట్టు యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. పాట్నా పైరెట్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుసగా మూడు సార్లు (2016, 2016, 2017) విజేతగా నిలిచింది. ఈ సీజన్-7లో పాట్నా పైరెట్స్ ఫెవరేట్ జట్టుగా బరిలోకి దిగింది. పటిష్ట జట్టు ఉన్న పాట్నాకు కప్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బ్రాండ్ అంబాసిడర్‌ నీతూ చంద్ర మాట్లాడుతూ... 'చిన్నతనం నుంచే క్రీడలు అంటే ఇష్టం. మైదానంలో కూడా ఆడాను. తర్వాత సినీ రంగంలోకి వచ్చా. పాట్నా సొంత మైదానం. పాట్నా పైరెట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్ కావడం ఆనందంగా ఉంది. ప్రతిభ, కృషి నిరూపించుకునేందుకు ఇదే మంచి అవకాశం. పాట్నా పైరెట్స్ టైటిల్ గెలిచి మరోసారి నిరూపించుకోవాలి' అని నీతూ ఆకాంక్షించారు.

ఈ సీజన్-7లో ఎన్నో అంచనాలతో బరిలో దిగిన పాట్నా పైరెట్స్‌కు తొలి మ్యాచ్‌లో పరాభవం ఎదురైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బెంగళూరు బుల్స్‌ 34-32తో పైరేట్స్‌పై విజయం సాధించింది. పాట్నా తరపున రైడింగ్‌లో డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ (10 పాయింట్లు) చెలరేగినా.. డిఫెన్స్ బలహీనతల కారణంగా ఓటమి తప్పలేదు. ప్రొ కబడ్డీ లీగ్‌లో మంగళవారం సెలవు రోజు. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాతో బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన తెలుగు టైటాన్స్ బోణీ కొట్టాలని చూస్తోంది. టెటాన్స్‌ స్టార్‌ రైడర్‌ సిద్ధార్థ్‌ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. శుక్రవారం తెలుగు టైటాన్స్ జట్టుతో పాట్నా పైరెట్స్‌ తలపడనుంది.

Story first published: Tuesday, July 23, 2019, 14:27 [IST]
Other articles published on Jul 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+