Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pro Kabaddi League: హర్యానా స్టీలర్స్‌ను చిత్తు చేసి జైపుర్ హ్యాట్రిక్

ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ హోరాహోరీగా సాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ జైపుర్ పింక్ పాంథర్స్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన హర్యానా స్టీలర్స్ మ్యాచ్‌లలో 45-34 తేడాతో గెలిచింది. ఆట ప్రారంభమైన కాసేపటికే హర్యానాను ఆలౌట్ చేసి జైపుర్ సత్తాచాటింది. బ్రేక్ సమాయానికి 22-16తో ఆధిపత్యం చెలాయించింది.

PKL Season 10 : Haryana Steelers ను చిత్తు చేసి Jaipur Pink Panthers | Telugu OneIndia

అయితే సెకండ్ హాఫ్‌లో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. హర్యానా ప్లేయర్లు విజృంభించారు. జైపుర్‌ను ఆలౌట్ చేసి 28-29తో పోటీలోకి వచ్చి షాక్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత అదే ఊపు ప్రదర్శించలేక చతికిలపడ్డారు. జైపుర్ పింక్ పాంథర్స్ విజయంలో రైడర్స్‌తో పాటు డిఫెండర్స్ కీలక పాత్ర పోషించారు. రైడర్ అర్జున్ (14) సూపర్ 10 సాధించాడు. డిఫెండర్ రెజా ఏడు పాయింట్లు , అంకుశ్‌ అయిదు పాయింట్లు సాధించారు. హర్యానా స్టీలర్స్ తరపున రైడర్ చంద్రన్‌ రంజిత్‌ (11), డిఫెండర్ మోహిత్‌ (5) పోరాడారు.

Pro Kabaddi League: Jaipur Pink Panthers thrashed Haryana Steelers for a hat-trick win

బుధవారం జరిగిన మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై పుణెరి పల్టాన్ 40-31 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ఆద్యంతం నువ్వానేనా అన్నట్టుగానే సాగింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి పుణెరి 22-18తో పైచేయి సాధించింది. అయితే సెకండ్ హాఫ్‌లో యోధాస్ రైడర్లు సామర్థ్యం మేరకు ఆడలేకపోయారు. పుణెరి తరపున ఆల్‌రౌండర్లు అస్లామ్ (11), మహమ్మద్రెజా (7) సత్తాచాటారు. యూపీ యోధాస్ జట్టులో కెప్టెన్ పర్దీప్ నర్వాల్ (6) ,డిఫెండర్లు సుమిత్ (6), నితీశ్ కుమార్ (5) పోరాడారు.

ముంబయి వేదికగా రేపు జరిగే మ్యాచ్‌ల్లో పాట్నా పైరేట్స్-దబాంగ్ దిల్లీ కేసీ; యూ ముంబా- బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. కాగా, పాయింట్స్ టేబుల్ టాపర్‌గా పుణెరి పల్టాన్ ఉంది. గుజరాత్ జెయింట్స్, జైపుర్ పింక్ పాంథర్స్, దబాంగ్ దిల్లీ టాప్-4 స్థానాల్లో ఉన్నాయి. టేబుల్ అట్టడుగున తెలుగు టైటాన్స్ జట్టు ఉంది. టైటాన్స్ ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించింది.

Story first published: Thursday, January 4, 2024, 11:13 [IST]
Other articles published on Jan 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+