Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pro Kabaddi League: ఉత్కంఠ పోరులో పుణెకు జైపుర్ షాక్

ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ హొరాహొరీ మ్యాచ్‌లతో ఆసక్తికరంగా సాగుతోంది. జైపుర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌‌లో పుణెరి పల్టాన్‌పై జైపుర్ పింక్ పాంథర్స్ 36-34 తేడాతో విజయం సాధించింది. వరుస విజయాలతో జోరు మీదున్న పుణెరికి జైపుర్ షాక్ ఇచ్చింది.

అయితే తొలి అర్ధభాగం ముగిసేసరికి జైపుర్ 11-20 పాయింట్లతో వెనుకంజలో నిలిచింది. రైడింగ్‌లో ఆ జట్టు విఫలమైంది. ఆరు పాయింట్లే సాధించింది. డిఫెండింగ్‌లో నాలుగు పాయింట్లు సాధించింది. మరోవైపు పుణెరి రైడర్లు 20 పాయింట్లతో సత్తాచాటారు. పుణెరి జోరు చూస్తే జైపుర్ ఓటమి దాదాపు ఖరారైపోయినట్లుగా కనిపించింది.

Pro Kabaddi League: Jaipur Pink Panthers shocks Puneri Paltan in thrilling battle

కానీ సెకండ్ హాఫ్‌లో జైపుర్ పింక్ పాంథర్స్ ఊహించని విధంగా చెలరేగింది. వరుస పాయింట్లతో హోరెత్తించింది. రెండో అర్ధభాగంలో జైపుర్ 25 పాయింట్లు సాధిస్తే పుణెరి 14 పాయింట్లు మాత్రమే అందుకుంది. జైపుర్ విజయంలో కెప్టెన్, రైడర్ అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లతో కీలక పాత్ర పోషించాడు. డిఫెండర్ సునిల్ కుమార్ 5 పాయింట్లతో రాణించాడు. పుణెరి జట్టులో ఆల్‌రౌండర్ అస్లామ్ (8) టాప్ స్కోరర్.

జైపుర్ వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై బెంగాల్ వారియర్స్ 42-37తో విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే బెంగాల్ దూకుడుగా పాయింట్లు సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 21-14 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ హాఫ్‌లో యూపీ యోధాస్ పోరాడినా అది ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. బెంగాల్ జట్టులో రైడర్లు మణిందర్ సింగ్ (14), నితీన్ కుమార్ (10) సూపర్-10తో సత్తాచాటారు. యూపీ యోధాలో పరదీప్ నర్వాల్ (16) పోరాడాడు.

కాగా, పాయింట్స్ టేబుల్‌లో పుణెరి పల్టాన్, జైపుర్ పింక్ పాంథర్స్, దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్ టాప్-4లో నిలిచారు. తెలుగు టైటాన్స్ అట్టడుగన నిలిచింది. ఇవాళ జైపుర్ వేదికగా హర్యానా స్టీలర్స్‌తో తమిళ్ తలైవాస్, దబాంగ్ ఢిల్లీతో పాట్నా పైరేట్స్‌ తలపడనున్నాయి.

Story first published: Sunday, January 14, 2024, 8:04 [IST]
Other articles published on Jan 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+