అనూప్ శ్రమ వృధా: ప్రో కబడ్డీలో హర్యానాకు తిరుగులేదు
హైదరాబాద్: ప్రొ కబడ్డీలో హర్యానా స్టీలెర్స్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తాజాగా పదో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం చెన్నై నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన జోన్-ఎ మ్యాచ్‌లో స్టీలెర్స్ 41-30తో ముంబాను చిత్తుగా ఓడించింది.
హర్యానా జట్టులో దీపక్ కుమార్ దహియా 8, వికాస్ కాందోలా 8 రైడింగ్ పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించారు. జట్టు మొత్తం రైడింగ్ పాయింట్ల (24)లో ఈ ముగ్గురూ కలిసి 23 పాయింట్లు సాధించడం విశేషం. యు ముంబాలో అనూప్ కుమార్ (10) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

డిఫెన్స్‌లో పూర్తిగా విఫలమైన ముంబా
ముంబా జట్టు డిఫెన్స్‌లో పూర్తిగా విఫలమైంది. కేవలం మూడు పాయింట్లే సాధించింది. రైడర్లు స్వేచ్ఛగా స్కోరు చేయగలిగారు. ఆది నుంచే ధాటిగా ఆడిన హర్యానా జట్టు తొలి అర్థభాగం ముగిసే సరికి 22-16 పాయింట్లతో ఆధిక్యం సంపాదించింది. రెండో అర్థభాగంలో హర్యానా మరింత దూకుడుని పెంచింది.

పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో
ఈ విజయంతో జోన్ ఏ నుంచి 19 మ్యాచ్‌ల ద్వారా 64 పాయింట్లు సాధించిన హర్యానా జట్టు పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు యు ముంబా 54 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో హర్యానా 24 రైడింగ్, 11ట్యాకిల్, 4 ఆలౌట్, 2 ఎక్స్‌ట్రా పాయింట్లు సాధించగా యు ముంబా 23 రైడింగ్, 3 ట్యాకిల్, 4 ఎక్స్‌ట్రా పాయింట్లు మాత్రమే సాధించింది.

మరో మ్యాచ్‌లో యూపీ యోధా విజయం
మరో మ్యాచ్‌లో యూపీ యోధా జట్టు 37-33 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్ జట్టును ఓడించింది. దీంతో నాకౌట్ అవకాశాలను మరింతగా మెరుగుపరుచుకుంది. యూపీ తరఫున నితిన్ తోమర్ 12 పాయింట్లు చేశాడు. తలైవాస్ జట్టులో అజయ్ ఠాకూర్ 15 పాయింట్లు సాధించాడు.

జోన్ బీలో మూడోస్థానంలో కొనసాగుతోన్న యూపీ యోధా
ఈ విజయంతో మొత్తం 19 మ్యాచ్‌లలో 7 విజయాలు నమోదు చేసిన యూపీ యోధా 54 పాయింట్లతో జోన్ బీలో మూడోస్థానంలో కొనసాగుతోంది. ఇక తెలుగు టైటాన్స్ 48 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ రెండు జట్లలో ఒకటి నాకౌట్ దశకు చేరుకునే వీలుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications