Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరోసారి రెచ్చిపోయిన బుల్స్.. గుజరాత్‌లు

Pro Kabaddi League: Bengaluru Bulls Beat Jaipur Pink Panthers, Gujarat Fortunegiants Edge Past UP Yoddha

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆదివారం బెంగళూరు బుల్స్‌ జోరు చూపించి జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌పై ఘనవిజయం సాధించింది. ఆ జట్టు రైడర్‌ పవన్‌ సెహ్రావత్‌ ఏకంగా 19 పాయింట్లు కొల్లగొట్టడం విశేషం. బెంగళూరు జట్టులో పవన్‌(19), మహేందర్‌(5), కాశిలింగ్‌(5) రాణించారు. రోహిత్‌ కుమార్‌ కూడా రెండు సూపర్‌ రైడ్లతో సత్తా చాటాడు. ప్రత్యర్థి జట్టులో దీపక్‌ హుడా 10 పాయింట్లతో మెరిశాడు.

ప్రథమార్ధం అయ్యేసరికి బెంగళూరు 17-18తో వెనుకబడటం గమనార్హం. పవన్ షెర్వాత్ (19 పాయింట్లు) రైడింగ్‌లో దుమ్మురేపడంతో.. ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బుల్స్ 45-32తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై నెగ్గింది. ఐతే రెండో అర్ధంలో ఆ జట్టు ఆటగాళ్లు చెలరేగిపోయారు. ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు.

34వ నిమషానికే 37-24తో విజయం ఖరారు చేసుకున్న బుల్స్‌.. చివరిదాకా ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకుని విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మహేందర్ (5), కాశీలింగ్ (5), రోహిత్ (3) రాణించారు. జైపూర్ జట్టులో దీపక్ హుడా (11), అజింక్యా (7), సందీప్ (3) మోస్తరుగా ఆడారు.

మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్‌జెయింట్స్ 37-32తో యూపీ యోధాపై నెగ్గింది. గుజరాత్‌ జట్టులో సచిన్‌ (8 పాయింట్లు) టాప్‌స్కోరర్‌గా నిలవగా.. ప్రత్యర్థి జట్టులో శ్రీకాంత్‌ జాదవ్‌ 11 పాయింట్లు సాధించాడు. గుజరాత్ తరఫున సచిన్ (8), సునీల్ (5), రుత్‌రాజ్ (4) రాణించగా, యూపీకి శ్రీకాంత్ (11), నితేశ్ (5), జీవా (4) పాయింట్లు అందించినా ప్రయోజనం లేకపోయింది. సోమవారం కబడ్డీ మ్యాచ్‌లకు విరామం.

Story first published: Monday, November 19, 2018, 10:12 [IST]
Other articles published on Nov 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+