Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pro Kabaddi League 2023: గత సీజన్‌లో అట్టడుగున నిలిచిన తెలుగు టైటాన్స్.. ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభిస్తుందా?

Telugu Titans: ఏడాది తర్వాత మళ్లీ అందర్నీ అలరించేందుకు 'ప్రొ కబడ్డీ లీగ్' వచ్చేసింది. నిమిష నిమిషానికి ప్రేక్షకుల్లో థ్రిల్ కలిగించే ఈ లీగ్ కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. గత తొమ్మిది సీజన్లుగా ఈ లీగ్ పాపులారిటీ చాలా పెరిగింది. ఒక్కో టీం ఫాలోవర్లు కూడా బాగానే పెరిగారు. ఐదో సీజన్ నుంచి ఈ లీగ్‌లో తలపడుతున్న జట్ల సంఖ్య 12కు పెరిగింది.

కానీ వీటిలో కేవలం ఆరు మాత్రమే ఇప్పటి వరకు లీగ్ ఛాంపియన్లుగా నిలిచాయి. ఈసారి అహ్మదాబాద్‌లోని ది ఏరీనా ట్రాస్‌స్టేడియా వేదికగా ఈ లీగ్ మొదలవుతుంది. డిసెంబరు 2న మొదలయ్యే ఈ లీగ్.. తొలి రోజే రెండు మ్యాచులు జరగనున్నాయి. ఒక మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడతాయి.

Pro Kabaddi League 2023 Telugu Titans will be playing first match of the 10th season

మరో మ్యాచులో యూ-ముంబా, యూపీ యోద్ధాస్ ఢీకొట్టనున్నాయి. తెలుగు వాళ్లందరూ కూడా తెలుగు టైటాన్స్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు టైటిల్ నెగ్గకపోయినా కూడా.. ఈ జట్టుకు ఫ్యాన్స్‌లో ఫాలోయింగ్ చాలానే ఉంది. గత సీజన్‌లో తెలుగు టైటాన్స్ చాలా పేలవ ప్రదర్శన చేశారు.

ఆడిన 22 మ్యాచుల్లో కేవలం రెండింట మాత్రమే విజయం సాధించారు. ఏకంగా 20 మ్యాచుల్లో ఓటమిపాలయ్యారు. ఇంత ఘోరమైన ప్రదర్శన మరే జట్టు చేయలేదు. చాలా మ్యాచుల్లో కనీసం పోటీ కూడా తెలుగు టైటాన్స్ ఇవ్వలేకపోయింది. ఈ క్రమంలోనే ఈసారైనా తమ అభిమాన జట్టు రాత మారుతుందేమోనని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

అయితే ఓవరాల్ లీగ్ హిస్టరీలో అత్యధిక రెయిడ్ పాయింట్లు సాధించిన జట్ల జాబితాలో తెలుగు టైటాన్స్ ఐదో స్థానంలో ఉంది. అంటే ఈ టీంలో సత్తాకు కొదవేం లేదు. కాబట్టి అభిమానులు ఈ టీం రాణించాలని కోరుకుంటున్నారు. తొలి మ్యాచును విజయంతో ప్రారంభించాలని ప్రార్థిస్తున్నారు.

Story first published: Wednesday, November 22, 2023, 20:14 [IST]
Other articles published on Nov 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+