For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుణెరి పల్టన్‌పై గెలుపు: ముంబా ఖాతాలో మరో విజయం

Pro Kabaddi League 2019: U Mumba hammer Puneri Paltan by 33-23 to win Maharashtra Derby

హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్‌లో యు ముంబా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 33-23తో పుణెరి పల్టన్‌పై విజయం సాధించింది. కెప్టెన్‌ ఫజల్‌ (4), సందీప్‌ నర్వాల్‌ (4), సురీందర్‌ సింగ్‌ (4)లు డిఫెన్స్‌లో అద్భుత ప్రదర్శన చేయగా... రైడింగ్‌లో అభిషేక్‌ సింగ్‌ 5 పాయింట్లు సాధించాడు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

మ్యాచ్ ఆరంభం నుంచీ ఇరు జట్ల ఆటగాళ్లు పాయింట్ల కోసం పోటాపోటీగా తలపడ్డారు. 2-2తో ఉన్న సమయంలో శుభమ్‌ షిండే పాయింట్‌ తేవడంతో పుణె 3-2తో ముందంజ వేసింది. ఆ తర్వాత డాంగ్‌ కాంగ్‌ లి, సందీప్‌ నర్వాల్‌ను పట్టేయడంతో పుణెరి పల్టన్‌ 5-2తో ముందంజ వేసింది. ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు సాధించి ముంబా 5-5తో స్కోరు సమం చేసింది.

తొలి 12 నిమిషాల ఆట ముగిసే సరికి రెండు జట్లు 7-7తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత కీలక సమయంలో పుంజుకొన్న ముంబా 11-9తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. రెండో అర్ధభాగంలో ముంబా డిఫెండర్లు గొప్పగా పుంజుకున్నారు. ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి జట్టుకు 15-10తో ఆధిక్యాన్ని అందించారు.

ఆ తర్వాత ముంబా రైడర్లు వరుసగా పాయింట్లు తేవడంతో 21-12తో నిలిచింది. చివరి తొమ్మిది నిమిషాల ఆట మిగిలి ఉందనగా మరోసారి పుణెరిని ఆలౌట్‌ చేసిన ముంబా 27-17తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న ముంబా 33-23తో మ్యాచ్‌ను నెగ్గింది. పుణెరి జట్టులో సుర్జీత్‌ సింగ్‌ (6), పవన్‌ కడియాన్‌ (4) మెరిశారు.

Story first published: Sunday, July 28, 2019, 9:16 [IST]
Other articles published on Jul 28, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+