ప్రొ కబడ్డీలో ఎట్టకేలకు ఓ విజయం: జైపుర్‌పై తెలుగు టైటాన్స్‌ విజయం

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ చాలారోజుల తర్వాత ఓ భారీ విజయం సాధించింది. సిద్ధార్థ్‌ దేశాయ్‌ రైడింగ్‌లో 22 పాయింట్లతో చెలరేగడంతో శుక్రవారం మ్యాచ్‌లో టైటాన్స్‌ 51-31 తేడాతో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌పై ఘన విజయం సాధించింది. మరో రైడర్ రజనీశ్ (11పాయింట్లు) కూడా సూపర్-10తో కదం తొక్కాడు.

గత ఐదు మ్యాచ్‌ల తర్వాత తెలుగు టైటాన్స్‌‌కు ఇదే తొలి విజయం. మ్యాచ్ ప్రారంభం నుంచి సిద్ధార్థ్ దేశాయ్ రెచ్చిపోవడంతో టైటాన్స్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి ఐదు నిమిషాలు ముగిసే సరికి తెలుగు టైటాన్స్‌ 6-2తో ఆధిక్యాన్ని సంపాదించింది. అదే సమయంలో దీపక్‌ హుడా (12) రాణించడంతో జైపుర్‌ పాంథర్స్ తిరిగి పుంజుకుంది.

తొలి అర్ధభాగం ముగిసే సరికి టైటాన్స్ 17-15పాయింట్లతో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. సిద్ధార్థ్‌ దేశాయ్‌ రైడింగ్‌లో బుల్లెట్‌లా దూసుకుపోయాడు. మరో నాలుగు నిమిషాలకే ఒకే రైడ్‌లో సిద్ధార్థ్ ముగ్గురిని ఔట్ చేయడంతో పాట్నా మరోసారి ఆలౌటైంది.

దీంతో ఆధిక్యం ఏకంగా 31-18గా మారింది. ఆ తర్వాత కూడా టైటాన్స్ ఆటగాళ్లు అదే జోరు కనబరిచారు. దీంతో తెలుగు టైటాన్స్‌ పాయింట్లలో హాఫ్ సెంచరీ కొట్టేసింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 35-33తో యు ముంబాపై గెలుపొందింది. పవన్‌ షెరావత్‌ 11 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ప్రొ కబడ్డీలో శనివారం

హరియాణా స్టీలర్స్‌ vs యూపీ యోధ (రాత్రి 7:30 నుంచి)

గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ vs తమిళ్‌ తలైవాస్‌ (రాత్రి 8:30 నుంచి)

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, September 28, 2019, 7:43 [IST]
Other articles published on Sep 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X