ప్రొ కబడ్డీలో ఎట్టకేలకు ఓ విజయం: జైపుర్‌పై తెలుగు టైటాన్స్ విజయం

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ చాలారోజుల తర్వాత ఓ భారీ విజయం సాధించింది. సిద్ధార్థ్ దేశాయ్ రైడింగ్‌లో 22 పాయింట్లతో చెలరేగడంతో శుక్రవారం మ్యాచ్‌లో టైటాన్స్ 51-31 తేడాతో జైపుర్ పింక్ పాంథర్స్‌పై ఘన విజయం సాధించింది. మరో రైడర్ రజనీశ్ (11పాయింట్లు) కూడా సూపర్-10తో కదం తొక్కాడు.
గత ఐదు మ్యాచ్‌ల తర్వాత తెలుగు టైటాన్స్‌కు ఇదే తొలి విజయం. మ్యాచ్ ప్రారంభం నుంచి సిద్ధార్థ్ దేశాయ్ రెచ్చిపోవడంతో టైటాన్స్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి ఐదు నిమిషాలు ముగిసే సరికి తెలుగు టైటాన్స్ 6-2తో ఆధిక్యాన్ని సంపాదించింది. అదే సమయంలో దీపక్ హుడా (12) రాణించడంతో జైపుర్ పాంథర్స్ తిరిగి పుంజుకుంది.
తొలి అర్ధభాగం ముగిసే సరికి టైటాన్స్ 17-15పాయింట్లతో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. సిద్ధార్థ్ దేశాయ్ రైడింగ్‌లో బుల్లెట్‌లా దూసుకుపోయాడు. మరో నాలుగు నిమిషాలకే ఒకే రైడ్‌లో సిద్ధార్థ్ ముగ్గురిని ఔట్ చేయడంతో పాట్నా మరోసారి ఆలౌటైంది.
దీంతో ఆధిక్యం ఏకంగా 31-18గా మారింది. ఆ తర్వాత కూడా టైటాన్స్ ఆటగాళ్లు అదే జోరు కనబరిచారు. దీంతో తెలుగు టైటాన్స్ పాయింట్లలో హాఫ్ సెంచరీ కొట్టేసింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 35-33తో యు ముంబాపై గెలుపొందింది. పవన్ షెరావత్ 11 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ప్రొ కబడ్డీలో శనివారం
హరియాణా స్టీలర్స్ vs యూపీ యోధ (రాత్రి 7:30 నుంచి)
గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ vs తమిళ్ తలైవాస్ (రాత్రి 8:30 నుంచి)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications