For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PKL 2019: నేడు ప్రొ కబడ్డీ సెమీఫైనల్స్.. షెడ్యూల్, టైమింగ్స్, జట్ల వివరాలు!!

Pro Kabaddi League 2019 Semifinals: Schedule, Timings, Venue, Teams Details


అహ్మదాబాద్: ప్రొకబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ తుది అంకానికి చేరింది. జూలై 20న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మొదలైన ఏడో సీజన్ విజయవంతంగా లీగ్, ప్లే ఆఫ్స్ దశను ముగించింది. ఇక ఇప్పుడు సెమీస్, ఫైనల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. భుధవారం రాత్రి జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్‌ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రో కబడ్డీ లీగ్ 2019 సెమీఫైనల్లో తలపడే నాలుగు జట్లు దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్, యు ముంబా, బెంగళూరు బుల్స్.

ఆహ్మదాబాద్ ఇకా ఎరీనా స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్.. టేబుల్ టాపర్ దబాంగ్ ఢిల్లీ మధ్య బుధవారం తొలి సెమీ ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. రెండో సెమీస్‌లో బెంగాల్ వారియర్స్, యూ ముంబా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 8.30 గంటలకు మొదలవుతుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సెమీఫైనల్లో గెలిచిన రెండు జట్లు శనివారం ఫైనల్ మ్యాచ్ ఆడుతాయి.

సోమవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 48-45 యూపీ యోధాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగగా.. బుల్స్ స్టార్ రైడర్ పవన్ కుమార్ షెరావత్ (20 పాయింట్లు) విజృంభించడంతో అదనపు సమయంలో బెంగళూరు సునాయాస విజయాన్ని అందుకుంది. యూపీ జట్టులో రైజర్లు రిశాంక్ దేవడిగ (11పాయింట్లు), శ్రీకాంత్ యాదవ్ (9పాయింట్లు) రాణించారు.

సోమవారం జరిగిన రెండో ఎలిమినేటర్‌లో యూ ముంబా 46-38తో హర్యానా స్టీలర్స్‌పై సునాయాస విజయం సాధించింది. ముంబా తరుపున అభిషేక్ సింగ్ 16 రైడ్ పాయింట్లు, అర్జున్ దేశ్వాల్ 15 రైడ్ పాయింట్లు సాధించారు. హర్యానా తరపున వికాస్ ఖండోల 12 రైడ్ పాయింట్లు చేసినా.. అతనికి సహకారం అందించేవారు లేక ఓటమిని చవిచూసింది.

Teams (Possible 7s):

Dabang Delhi: Joginder Narwal, Ravinder Pahal, Naveen Kumar, Chandan Ranjit, Vishal Mane, Meraj Sheykh, Vijay

Bengaluru Bulls: Pawan Sehrawat, Rohit Kumar, Sumit Singh, Mahender Singh, Amit Sheoran, Saurabh Nandal, Mohit Sehrawat

Bengal Warriors: Maninder Singh, Mohammad Nabibakshsh, Rinku Narwal, Sukesh Hegde, K Prapanjan, Jeeva Kumar, Baldev Singh

U Mumba: Fazel Atrachali, Abhishek Singh, Arjun Deshwal, Surinder Singh, Harendra Kumar, Sandeep Narwal, Athul MS

Story first published: Wednesday, October 16, 2019, 8:50 [IST]
Other articles published on Oct 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+