For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రొకబడ్డీ: ఉత్కంఠభరితంగా ఎలిమినేటర్ మ్యాచ్‌లు.. సెమీస్‌కు చేరిన బెంగళూరు, ముంబా

Pro Kabaddi League 2019 Playoffs: Abhishek Singh, Arjun Deshwal star as U Mumba beat Haryana Steelers to secure semis berth

అహ్మదాబాద్: ప్రొకబడ్డీ లీగ్ సీజన్-7 తుది అంకానికి చేరింది. ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్, యూ ముంబా జట్లు విజయాలు అందుకుని సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. సోమవారం రాత్రి ఆహ్మదాబాద్ ఇకా ఎరీనా స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 48-45 యూపీ యోధాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగగా.. బుల్స్ స్టార్ రైడర్ పవన్ కుమార్ షెరావత్ (20 పాయింట్లు) విజృంభించడంతో బెంగళూరు సునాయాస విజయాన్ని అందుకుంది. యూపీ జట్టులో రైజర్లు రిశాంక్ దేవడిగ (11పాయింట్లు), శ్రీకాంత్ యాదవ్ (9పాయింట్లు) రాణించారు.

యూపీ యోధా మ్యాచ్ ప్రారంభంలో జోరు ప్రదర్శించింది. ఎనిమిదో నిమిషంలోనే బెంగళూరును ఆలౌట్ చేసి 11-4తో దూసుకెళ్లింది. ఆ తర్వాత కూడా ఆధిక్యాన్ని కొనసాగించిన యూపీ 19-11తో నిలిచింది. ఈ సమయంలో బుల్స్ రైడర్ పవన్ విజృంభించి సూపర్ రైడ్‌తో యూపీని ఆలౌట్ చేసి ఆధిక్యాన్ని తగ్గించాడు. తొలి అర్ధ భాగం ముగిసే సరికి యూపీ 20-17తో ముందంజలో నిలిచింది.

రెండో అర్ధ భాగంలోనూ పవన్ షెరావత్‌ను కట్టిడి చేసిన యూపీ.. 32-25తో ఆధిక్యంలోనే నిలిచింది. ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా.. 34-26తో యూపీ విజయం దిశగా దూసుకెళ్లింది. అయితే బుల్స్‌లో సుమీత్ సింగ్ పాయింట్లు సాధించడంతో పోరు హోరాహోరీగా సాగింది. చివర్లో బెంగళూరు రైడర్ పవన్ కీలక పాయింట్లతో ఆకట్టుకోవడంతో 40 నిమిషాల సమయం ముగిసే సరికి 36-36తో పాయింట్లు సమం అయ్యాయి. దీంతో ఆరు నిమిషాల అదనపు సమయంలో పవన్ షెరావత్ సూపర్ రైడింగ్‌తో బెంగళూరు విజయం సాధించింది.

అనంతరం జరిగిన రెండో ఎలిమినేటర్‌లో యూ ముంబా 46-38తో హర్యానా స్టీలర్స్‌పై సునాయాస విజయం సాధించింది. ముంబా తరుపున అభిషేక్ సింగ్ 16 రైడ్ పాయింట్లు, అర్జున్ దేశ్వాల్ 15 రైడ్ పాయింట్లు సాధించారు. హర్యానా తరపున వికాస్ ఖండోల 12 రైడ్ పాయింట్లు చేసినా.. అతనికి సహకారం అందించేవారు లేక ఓటమిని చవిచూసింది. బుధవారం సెమీస్ మ్యాచ్లు జరుగుతాయి. బెంగళూరు vs ఢిల్లీ, బెంగాల్ vs ముంబా జట్లు తలపడుతాయి.

Story first published: Tuesday, October 15, 2019, 8:16 [IST]
Other articles published on Oct 15, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+