ఆఖరి నిమిషంలో బెంగాల్ ఆలౌట్: పాంథర్స్ అద్భుత విజయం

హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. శనివారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముఖ్య అతిథిగా హాజరైన ముంబై అంచె పోటీల్లో రెండు మ్యాచ్‌లు అభిమానులను ఎంతగానో అలరించాయి. ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ తన జాతీయ గీతాలాపనతో ఆకట్టుకున్నాడు.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
కాగా, బెంగాల్ వారియర్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో జైపుర్ పింక్ పాంథర్స్ పైచేయి సాధించింది. చివరి నిమిషాల్లో కెప్టెన్ దీపక్ హుడా (6) రాణించి ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంతో జైపుర్ 27-25తో బెంగాల్‌ను ఓడించింది. జైపూర్ తరఫున రైడింగ్‌లో దీపక్ హుడా(6), డిఫెన్స్‌లో సందీప్ దల్(8) అదరగొట్టారు. ఇక బెంగాల్‌లో ప్రపంజన్(7), బల్దేవ్‌సింగ్(6) రాణించారు.

మ్యాచ్ ఆరంభంలో 4-0తో ఆధిక్యంలో
మ్యాచ్ ఆరంభంలో 4-0తో ఆధిక్యంలో నిలిచి బెంగాల్ ఆధిపత్యం ప్రదర్శించింది. రైడింగ్‌కు తోడు డిఫెన్స్‌లో పాయింట్లు కొల్లగొడుతూ ముందుకు సాగింది. ముఖ్యంగా ప్రపంజన్ తన తొమ్మిది రైడ్లలో ఆరు పాయింట్లు దక్కించుకున్నాడు. ఈ సమయంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన అజింక్యా పవార్ బెంగాల్‌కు నాలుగు పాయింట్లు అందించాడు. దీంతో ప్రథమార్ధం ముగిసే సరికి బెంగాల్ 14-10తో ఆధిక్యంలో నిలిచింది.

రెండో అర్ధభాగంలో
ఇక, రెండో అర్ధభాగంలో జైపూర్ వెనుదిరిగి చూడలేదు. బెంగాల్‌ను ఒత్తిడిలోకి నెడుతూ వరుసగా పాయింట్లను సొంతం చేసుకుంది. దీంతో మ్యాచ్ 25వ నిమిషానికి పాంథర్స్ 15-16 చేరుకుంది. అదే దూకుడు కొనసాగించిన ఆ జట్టు మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 24-20తో విజయం దిశగా సాగింది.

మ్యాచ్ ఆఖరి నిమిషాల్లో
మ్యాచ్ ఆఖరి నిమిషాల్లో బెంగాల్ ఆలౌట్ కావడం పాంథర్స్‌కు కలిసి వచ్చింది. సందీప్ ధూల్ (8) ట్యాక్లింగ్‌లో మెరివడంతో చివరి నిమిషంలో బెంగాల్‌ను ఆలౌట్ చేసి 26-24తో జైపుర్ ఆధిక్యంలోకి దూసుకెళ్లి మ్యాచ్‌ను దక్కించుకుంది. ఈ మ్యాచ్ ద్వారా మణిందర్‌సింగ్ 450వ రైడ్ పాయింట్ నమోదు చేసుకోగా, సందీప్ దల్ డిఫెన్స్‌లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు.

ప్రొ కబడ్డీలో ఆదివారం
ఢిల్లీ × హర్యానా (రాత్రి 7:30 నుంచి)
యు ముంబా × బెంగళూరు (రాత్రి 8:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications