

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. రాహుల్ చౌదరి (8 పాయింట్లు) విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం హోరాహోరీగా సాగిన అంతర్ జోనల్ మ్యాచ్‌లో టైటాన్స్ 28-25తో పుణెరి పల్టాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆరంభంలోనే టైటాన్స్ 3-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఏడో నిమిషంలో సూపర్ ట్యాకిల్ చేసిన పుణె 4-5తో పోటీలోకి వచ్చింది.
ఆ తర్వాత మరో సూపర్ ట్యాకిల్‌తో 6-6తో స్కోరు సమం చేసింది పుణె. రైడర్లు రాహుల్ చౌదరి (8 పాయింట్లు), నీలేష్ (6 పాయింట్లు) సత్తా చాటారు. మేఘానీ అద్భుతమైన టాకిలింగ్‌తో ఆట ప్రారంభమైన 3వ నిమిషానికే తెలుగు టైటాన్స్ పాయింట్ల ఖాతాను తెరిచింది. ఆట 10వ నిమిషానికి చేరుకునే సరికే 6-6 పాయింట్లతో ఇరు జట్ల స్కోరు సమమైంది. ఈ దశలో స్టార్ రైడర్ రాహుల్ చెలరేగడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 17-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఆట రెండో భాగంలో రైడర్ సందీప్ నర్వాల్ దుమ్మురేపడంతో పుణె 24-27 పాయింట్లతో విజయానికి సమీపానికి వచ్చింది. చివరి క్షణాల్లో ప్రత్యర్థి రైడర్లను కాచుకున్న టైటాన్స్ 28-25తో విజయం సాధించింది. టైటాన్స్ జట్టులో రాహుల్‌తో పాటు నీలేశ్ (6 రైడ్ పాయింట్లు), మదానె (4 ట్యాకిల్స్) రాణించారు. ఈ దశలో టైటాన్స్ డిఫెండర్లు అద్భుతంగా రాణించడంతో పుణె జోరుకు బ్రేక్‌లు పడ్డాయి. ఆట చివరి నిమిషంలో రాహుల్ పాయింట్ సాధించి టైటాన్స్‌ను గెలిపించాడు.
మరో మ్యాచ్‌లో యు ముంబా 41-24తో యూపీ యోధను ఓడించింది. ముంబా జట్టులో సిద్దార్థ్ దేశాయ్ (7 పాయింట్లు), సురేందర్‌సింగ్ (7 ట్యాకిల్స్) సత్తా చాటారు. యోధ జట్టులో శ్రీకాంత్ జాదవ్ (4 రైడ్ పాయింట్లు), నరేందర్ (5 ట్యాకిల్స్) ఆకట్టుకున్నారు. మ్యాచ్‌లలో తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్, యు ముంబాతో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి.