ప్రో కబడ్డీ: తమిళ్ తలైవాస్ చేతిలో తెలుగు టైటాన్స్ ఓటమి

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి. సోమవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 31-25 తేడాతో తెలుగు టైటాన్స్‌ను ఓడించింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి 11-18తో వెనుకబడ్డ టైటాన్స్, రాహుల్ చౌదరి ప్రతిభతో పుంజుకుని 15-19తో ప్రత్యర్థిని చేరుకునే ప్రయత్నం చేసింది.
అయితే, ఆ తర్వాత తమిళ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. డిఫెండర్ మంజిత్ చిల్లర్, రైడర్ అజయ్ ఠాకూర్ అద్భుతంగా రాణించడంతో తలైవాస్ సునాయాసంగా గెలిచింది. ఈ ఇద్దరూ తలో ఏడు పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 37-27తో యూపీ యోధాపై నెగ్గింది.
మంగళవారం ప్రో కబడ్డీ లీగ్‌కు విరామం.
ప్రో కబడ్డీ లీగ్‌లో బుధవారం
హరియాణా స్టీలర్స్ vs పుణేరీ పల్టన్,
బెంగళూరు బుల్స్ vs తెలుగు టైటాన్స్
Story first published: Tuesday, November 27, 2018, 8:51 [IST]
Other articles published on Nov 27, 2018
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications